రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయోద్దు ; జెఎసి నాయకులు రమేష్,రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 27 ; భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వాలు కాలరాయోద్దని జెఎసి జిల్లా ఇంచార్జ్ రమేష్,ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున రెబ్బెనలోని అథిది గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇందిరపార్క్ లోని ధర్నా చౌక్ ఉద్యమ వేదికగా ఉందని అలాంటి ధర్నా చౌక్ ను ఎత్తివేసి తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను శాంతియుతంగా తెలియజేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధర్నాలు,ఆందోళనలు ఉండవని కెసిఆర్ అంటే సమస్యలు ఉండవని అనుకున్నాం కానీ ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజల హక్కులను కాలరాస్తారాని అనుకొలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యమాలను అణచివేసేందుకు ఉద్యమాకారులపై,ప్రజా సంఘాల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని గుర్తు చేశారు.ధర్నా చౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,మండల కార్యదర్శి నర్సయ్య,ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment