కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 29 March 2017
మనస్తాపంతో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య
మనస్తాపంతో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య
36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 29 ; రెబ్బెన మండలంలోని తెలుగు దేశం నాయకులూ 36వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ప్రయాణ ప్రాంగణంలో జెండా ఎగురవేసారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ మండల అధ్యక్షులు సంగం శ్రీనివాస్ తెలుగు నైజం గురించి ప్రసంగించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ `కి మంచి భవిష్యత్తు ఉందని నాయకులు కార్యకర్తలు అదర్య పడవద్దు అని సూచించారు. తెలుగు దేశం ప్రజల పక్షన వుంటూ సమన్యాయం చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజయ్ జైస్వాల్,ఎస్ టి సెల్ మండల అజమేరా రమేష్ ,నాయకులూ నానాజీ, పోతిరెడ్డి ,నవీన్ ,వెంకటేష్,రాజు ,ధర్మరాజు తదితరులు పాల్గొన్నారుTuesday, 28 March 2017
ప్రశ్న పత్రం బయటకి వచ్చిన కేసులో నలుగురు అరెస్ట్
ప్రశ్న పత్రం బయటకి వచ్చిన కేసులో నలుగురు అరెస్ట్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 28 ; రెబ్బెన మండలంలోని జడ్.పి.హెచ్. ఎస్. ఉన్నత పాఠశాలలో సోమవారం సామాన్య ద్వితీయ ప్రశ్న పత్రం చరవాణి ద్వారా బయటకి వచ్చిన కేసులో నీకొడే రవీందర్, నరహరి , రాజేష్,నాగేందర్ లను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు డీస్పీ భాస్కర్ తెలిపారు . మంగళవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు రవీందర్ పరీక్షా కేంద్రంలోలి వెళ్లి కిటికీ వద్దగల విద్యార్థి దగ్గరి గల ప్రశ్న పత్రాన్ని చిత్రీకరించి బయటకు తీసుకు వచ్చి రాజేష్ మరియు నరహరిలకు సోషల్ మీడియా ద్వారా పంపించినట్లు తెలిపారు .తదుపరి ఆ ప్రశ్న పత్రాన్ని అన్న పూర్ణ హైస్కూల్ ప్రధాన ఉపాద్యాయుడు నాగేందర్ వద్దకి తీసుకు వెళ్లి వాటి యొక్క సమాధానాలను వ్రాయించి వాటిని పరీక్షా కేంద్రానికి చేరవేశారు . గణితం పరీక్షా రోజు కూడా ఇదే విదంగా జరగగా ఎక్సమినేర్ పట్టుకొని విద్యార్థులను మందలించి వదిలేసినట్లు పేరుకున్నారు . వీరికి సంబందించిన విద్యార్థులను లేపి అడగడంతో ఆగ్రహించిన నరహరి దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టు పేరుకున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రెబ్బెన సబ్ ఇన్స్పెక్టర్ దారం సురేష్,సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అద్వర్యంలో కేసుని వేగవంతంగా విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వారసత్వం కోసం ఏఐటీయూసీ ఆందోళనలు
వారసత్వం కోసం ఏఐటీయూసీ ఆందోళనలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 28 ; వారసత్వ ఉద్యోగాలకు చట్ట బద్ధత కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనులు మరియు డిపార్టుమెంట్ లలో మేనేజర్ లకు,అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ నాయకులూ మాట్లాడుతూ చట్ట బద్ధతతో కూడిన విఆర్ఎస్ ఉద్యోగాలను తిరిగి ప్రవేశ పెట్టాలని,కోర్టులో వేసిన రాజకీయ పార్టీ సభ్యుల పై సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అంతక ముందు కైరగూర ఓపెన్ కాస్ట్ లో నిర్వహించిన ద్వారా సమావేశంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ను దుయ్యబట్టారు.గత నాలుగు సంవత్సరాలలో కార్మికుల హక్కుల కోసం కాకుండా కార్మికులను మోసం చేయడానికే టీబీజీకేఎస్ ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చిందని అన్నారు.కార్మికులను పదే పదే మోసం చేస్తున్న టీబీజీకేఎస్ తీరును తీవ్రంగా ఆయన ఖండిoచారు.వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో ఏఐటీయూసీ నాయకులూ బయ్యా మొగిలి,ఎం.లక్ష్మి నారాయణ,శేషసేయణరావు,జగ్గయ్య,ఎస్.శ్రీనివాస్,సత్యనారాయణ,ఫిట్ కార్యదర్శులు జూపాక రాజేష్,నరసింహ్మారావు,వై.సారయ్య,జి.రమేష్,మల్లేష్,చక్రధర్,రమేష్,నరసింహ్మ సామీ,అంబెడ్కర్,దివాకర్,మదన్,భిక్షమయ్య,ఎం.సత్యనారాయణ,కిరణ్బాబు,ఎంఆర్ .చారీ,జనార్దన్ రెడ్డి,చుంచు రాజన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్,మండల ఇంచార్జి కస్తూరి రవి,జాడి సాయి తదితరులు పాల్గొన్నారు.
బధ్యులపై చర్యలు తీసుకొవాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
బధ్యులపై చర్యలు తీసుకొవాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 28 ; రెబ్బెన మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్. ఎస్. ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన సైన్స్ ద్వితీయ పరీక్ష పేపర్ లీకెజి ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి భధ్యులను విధుల నుండి తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఏఫ్) గా డిమాండ్ చేస్తున్నామని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు.మంగళవారం రోజున రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంవత్సరకాలం పాటు ఎంతో కష్టపడి విద్యార్థులు చదివారని,కొంత మంది సిబ్బంది వలన ప్రశ్న పత్రం బయటికి వచ్చిందనే ఆరోపణపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.పరీక్ష కేంద్రం వద్ద అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.పరీక్ష పత్రం లీకెజి ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి భద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని దీనికి విద్యాశాఖ అధికారులే పూర్తి భధ్యత వహించాలని హెచ్చరించారు.
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఏస్పీ
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఏస్పీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 28 ; కొమురం బీమ్ జిల్లాలోని మొత్తం 34 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా 6.570 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నట్లు జిల్లా విద్య అధికారి రఫీక్ అన్నారు . పరీక్షా మొదలుకొని ఇప్పటి వరకు పరీక్షా నిర్వహణ ప్రైవేట్ విద్య సంస్థల ఉపాధ్యాయుల మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల కనుసన్నల్లోని డొల్ల తనానికి అద్దం పడుతోంది. పరీక్షా జరుగుతున్నా కాలంలో ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో ఉపాధ్యాయులే సహకరిస్తున్నారన్న అపవాదులు లేకపోలేదు. రెండురోజుల్లో ముగియనున్న పదోతరగతి పరీక్షల్లో రెబ్బెన మండల్ లోని ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రంలోని అవకతవకలు వెలుగులోకి వచ్చాయి . పరీక్షా కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నివాస గృహాలకు అనుకోని ఉండడంతో పోకిరీలు గోడలపై నుండి చిట్టీలు అందిస్తున్నారన్న విషయమై జిల్లా పోలీస్ అధికారికి తెలియడంతో స్వయంగా డీఏస్పీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ విషయమై పరీక్ష జరుగుతున్నా సమయంలో పరీక్షా కేంద్రం చుట్టూ ప్రక్కల తిరుగుతూ చిట్టీలు అందిస్తున్న , పరీక్షా పేపర్ లీక్ కి సహకరించిన వారిని అదుపులోకి తీసుకోని విచారించి తదుపరి కేసు విచారణ పై పూర్తి చర్యలు తీసుకుంటామన్న జిల్లా పోలీస్ అధికారి డిఎస్పీ భాస్కర్ తెలిపారు.
Monday, 27 March 2017
రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయోద్దు ; జెఎసి నాయకులు రమేష్,రవీందర్
రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయోద్దు ; జెఎసి నాయకులు రమేష్,రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 27 ; భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వాలు కాలరాయోద్దని జెఎసి జిల్లా ఇంచార్జ్ రమేష్,ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున రెబ్బెనలోని అథిది గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇందిరపార్క్ లోని ధర్నా చౌక్ ఉద్యమ వేదికగా ఉందని అలాంటి ధర్నా చౌక్ ను ఎత్తివేసి తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను శాంతియుతంగా తెలియజేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధర్నాలు,ఆందోళనలు ఉండవని కెసిఆర్ అంటే సమస్యలు ఉండవని అనుకున్నాం కానీ ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజల హక్కులను కాలరాస్తారాని అనుకొలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యమాలను అణచివేసేందుకు ఉద్యమాకారులపై,ప్రజా సంఘాల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని గుర్తు చేశారు.ధర్నా చౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,మండల కార్యదర్శి నర్సయ్య,ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మాస్ కాపింగ్ కు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలి
మాస్ కాపింగ్ కు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలి
Sunday, 26 March 2017
నత్త నడకన తొలగింపు పనులు
నత్త నడకన తొలగింపు పనులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 27 ; రెబ్బెన మండల్ గోలేటి గ్రామంలోని సింగరేణి కార్మిక నివాస విధుల్లో ప్రధాన దారి పై గత వారం రోజులుగా వాటర్ ట్యాంక్ దారికి అడ్డంగా పడి ఉండడంతో అటువైపుగా వెళ్లే నివాస గృహ కార్మికుల కుటుంబాలు మరియు విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు నిర్ణిత కాలంలో తీసివేయాల్సిన ట్యాంకును కాలయాపన చేయడం తో వచ్చి పొయ్యే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నదని ప్రజలు వాపోతున్నారు ఇక నైన సంబంధిత సింగరేణి అధికారులు స్పందించి జనావాసాల్లోని సమస్యలను పట్టించుకోని త్వరిత గతిన రోడ్డుపై పడిఉన్న ట్యాంక్ ను తొలగించాలని కోరుతున్నారు.
అభివృద్ధి ఆకర్షితులై తెరాస పార్టీ లో చేరిక
అభివృద్ధి ఆకర్షితులై తెరాస పార్టీ లో చేరిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 26 ; తెలంగాణ ప్రభుత్వం అమలు పెట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఇతర పార్టీ ల నాయకులూ ఆకర్షితులై తెరాస పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఎంఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు. ఆదివారం కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ తన స్వగృహములో నూతన కార్యకర్తల చేరిక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎన్నో చేసిందని రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని ఇతర పార్టీల వారు ఆకర్షితులై నూతన సభ్యత్వలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెబ్బెన మండలం లోంచి ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ సభ్యత్వాలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కి ప్రతి ఒక్క సాయ సహకారాలు అవసరమని అందుచే నూతన సభ్యత్వాలను ఏ సమయం లో నైనా ఆహ్వానం పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాథం సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబు రావు, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ ఛారీమెన్ కుందారపు శంకరమ్మ, మండల అదేక్షుడు కోట శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోమశేఖర్ , మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్, గజ్జెల సత్యనారాయన , ఎరగటి పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.
వేతనతో కూడిన సెలవును ప్రకటించాలీ
వేతనతో కూడిన సెలవును ప్రకటించాలీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 26 ; అంబేత్కర్ జయంతి సందర్బంగా వేతనం తో కూడిన సెలవును ప్రకటించాలని సంక్షేమ సంఘం బెల్లంపలికి ఏరియా అధ్యక్షులు బి గోపాల కృష్ణ అన్నారు. ఆదివారం సంభందిత అధికారికి వినతి పత్రం అందజేసి సంభందించిన కర పత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఏప్రిల్ 14న అంబేత్కర్ జయంతి పురస్కరించుకొని కార్మికులకు వేతనం తో కూడిన సెలవు దినాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసారు. దీనికి తెరాస, ఏఐటీయూసీ, ఐ.న్.టి.యూ.సి, హెచ్ ఎం స్ ఐ పి టి యూ ఇతర యూనియన్ వారు ఈ నెల 27న కార్మికులు అధికారులు అందరు నల్ల బాడ్జిలు ధరించి నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి తిరుపతి, ఆర్ రమేష్, డి బాపు, జి రమేష్, జి ఎల్లయ్య , ఫై సూరయ్య , ఏ మొగిలి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సీత రామ ఆంజనేయుల దేవాలయ కమిటీ ఎన్నిక
శ్రీ సీత రామ ఆంజనేయుల దేవాలయ కమిటీ ఎన్నిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 26 ; రెబ్బెన మండలం లో శ్రీ సీత రామ ఆంజనేయులు దేవాలయ కమిటీ ఎన్నుకున్నట్లు అధ్యక్షులు తక్కలపల్లి రాజేశ్వర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా కుందరపు శంకరమ్మ, నవీన్ జైస్వాల్, గౌరవ అధ్యక్షలుగా పెసర వెంకటమ్మ ప్రధాన కార్యదర్శిగా మోడెమ్ సుదర్శన్ గౌడ్ కోశాధికారి గోలి వెంకన్న కార్యదర్శులుగా సురేష్ జైస్వాల్,మోడెమ్ గౌడ్, అజయ్ కుమార్ జైస్వాల్, అజమేరా రమేష్, వనమాల ఫణి కుమార్, మిట్ట దేవేందర్, మద్ది శ్రీనివాస్ గౌడ్, రాపాల శ్రీనివాస్, రాపర్తి అశోక్, బొమ్మినేని శ్రీధర్ కుమార్ ఎన్నికలైనట్లు పేర్కొన్నారు.
Friday, 24 March 2017
84వ వార్షిక క్రీడా దినోత్సవం
84వ వార్షిక క్రీడా దినోత్సవం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 24 ; సింగరేణి వర్క్ పీపుల్స్ స్పోర్ట్ అండ్ గేమ్స్ అసోసియేషన్స్ 84వ వార్షిక క్రీడా దినోయ్హసవాన్ని ఈ నెల 26న గోలేటిిలోని సింగరేణి హై స్కూల్ లో నిర్వహించనున్నట్లు డీజీమ్ పర్సనల్ జ్ చిత్తరాంజన్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వార్షిక దినోత్సవ సందర్బంగా మహిళకు కార్మికుల కు బాల బాలికలకు అధికారులకు వివిధ రకాల క్రీడ పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.బెల్లంపల్లి,మాదారం కాలనీ వాసులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
టీ.ఆర్.ఎస్, టి.బి.జి.కె.ఎస్. వైఫల్యంతో కార్మిక కుటుంబాలల్లో ఆందోళనలు
టీ.ఆర్.ఎస్, టి.బి.జి.కె.ఎస్. వైఫల్యంతో కార్మిక కుటుంబాలల్లో ఆందోళనలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 24 ; 2012 లో సింగరేణిలో జరిగిన ఎన్నికలల్లో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాన ఎజెండా పెట్టుకొని ఎన్నికలల్లో గెలిచిన టిబిజికెయస్, 2014లో జరిగిన ఎన్నికలల్లో టి.ఆర్.యస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టి.ఆర్.యస్. ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలపై కాలయాపన చేయడం జరిగిందని ఎఐటియుసి గోలేటి బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య అన్నారు. గోలేటిలోని కెయల్ మహేంధ్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని ఎఐటియుసి ఆద్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేయగా సింగరేణిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనాలోచిత పద్దతులల్లో ఏకపక్షంగా వారసత్వ ఉద్యోగాలను ప్రకటించారని,వారసత్వ ఉద్యోగాలపై అవగాహన ఉన్న ఎఐటియుసి నాయకత్వం వారసత్వ ఉద్యోగాలకు 12(3) యాక్ట్ ప్రకారం ఆర్.యల్.సి. వద్ద అగ్రిమెంట్ చేసుకుంటే దీనికి ఎలాంటి ఇబ్బందులు రావాని సలహ ఇవ్వడం జరిగిందని ఆ మాటను పెడచెవిన పెట్టిన టి.బి.జి.కె.యస్. నాయకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నేడు కార్మిక కుటుంబాలను మానసికంగా ఆందోళనకు గురి చేసిందని అన్నారు. కనీస అవగాహన లేకుండా వారసత్వ ఉద్యోగాలకు ఎలాంటి చట్టబద్దత కల్పించకుండా ఉద్యోగాలను ప్రకటించడం వలన ఒక నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించడం వలన ఈ రోజు హైకోర్టు వారసత్వ ఉద్యోగాలను నిలిపివేయడం జరిగిందని అన్నారు. చట్టబద్దత కల్పించి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో టి.బి.జి.కె.యస్. నాయకుల అనాలోచిత నిర్ణయం వలన కార్మిక కుటుంబాలు మానసికంగా బాధ పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టబద్దంగా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు అమలు జరిగే వరకు ఎఐటియుసి గా కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి ఆర్గనైజింగ్ కార్యదర్శి శేషు,నాయకులు సురేష్ కోరి,ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎఐవైఏఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు బోగే ఉపేందర్ లు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణాలో భాగస్వాములు అవ్వండి ; జిల్లా మహిల ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ
బంగారు తెలంగాణాలో భాగస్వాములు అవ్వండి ;
జిల్లా మహిల ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ
జిల్లా మహిల ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 24 ; బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ సబ్యత్వం నమోదు కార్యక్రమాన్ని రెబ్బెన మండలంలోని గ్రామాల్లో నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుగు తెలంగాణ ప్రభుత్వం తోనే అభివృద్ధి పనులు సాద్యం అవుతాయని పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేసుకొవాలని ఆమె కోరారు.
Wednesday, 22 March 2017
అకీర్డిషన్ కార్డుల వెంటనె జారీ చేయాలని కలెక్టర్ కు వినతి ; టీ యూ డబ్ల్యూ జె (ఐ జె యూ).
అకీర్డిషన్ కార్డుల వెంటనె జారీ చేయాలని కలెక్టర్ కు వినతి
టీ యూ డబ్ల్యూ జె (ఐ జె యూ)..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 22 ; కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో పని చేస్తున్న జర్నలిస్టు లకు వెంటనే అకీర్ డిషన్ జారీ చేయాలని టీ యూ డబ్ల్యూ జే (ఐ జె యూ ) జిల్లా నాయకులూ జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ సందర్బంగా టి యూ డబ్ల్యూ జె కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్, ఆక్రీ డిషన్ కమిటీ మెంబెర్ ,ఈ ప్రకాష్ గౌడ్ ,నాయకులు మాటాడుతూ జిల్లాలోని జర్నలిస్టులకు అకీర్ డిషన్ కార్డులు జారీ లో జాప్యం లేకుండా వెంటనే జారీ చేయాలని కోరారు.సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అకీర్ డిషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్ చెప్పారు.ఈ కార్యక్రమం లో ఎలక్ట్రానిక్ మీడియా నోయోజకవర్గా అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులూ సదానంద్ బింబరే,రావుల శంకర్ , అడపా సతీష్, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.
శ్రమదోపిడీకి గురిచేస్తున్నసింగరేణి యాజమాన్యం
శ్రమదోపిడీకి గురిచేస్తున్నసింగరేణి యాజమాన్యం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 22 ; సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడిని దోచుకుంటూ వెట్టి చాకిరిలు చేయిస్తున్నారని ఏ.ఐ.టి.యూ.సి బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. బుధవారం గోలేటి జీఎం కార్యలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేసారు. అనంతరం అయన మాట్లాడుతు జె.ఏ.సి ఆధ్వర్యం లో నిరవధిక సమ్మెలు 8వ రోజు గడుస్తున్నా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరీలు చేయిస్తూ కనీసం వేతనం చెల్లించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. గుర్తింపు కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేసారు సహాయ కార్యదర్శి కె. సాగర్ గౌడ్, తిరుపతి, రాజేష్, చంద్రయ్య, బి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ మేనేజర్ సమావేశం
బ్యాంక్ మేనేజర్ సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 22 ; రెబ్బన తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తహశీల్ధార్ రమేష్ గౌడ్ అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ , బ్యాంకు మేనేజర్ ల తో సమావేశం ఏర్పాటు చేసారు . ఈ నెల 24వ తేదీన బ్యాంక్ అకౌంట్ లేనివారి కోసం స్థానిక మండలపరిషత్ కార్యాలయం దగ్గర బ్యాంక్ మేళా నిర్వహిస్తున్నామని బ్యాంక్ అకౌంట్ లేని వారు రేషన్ కార్డు ,ఆధార్ కార్డు జీరాక్స్ ,రెండు ఫోటోలు వెంట తీసుకు వచ్చు కోవాలని సూచించారు ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోని డిజిటల్ ఇండియా లో అందరు భాగస్వామం కావాలని తెలియజేశారు . ఈ సమావేశం లో బ్యాంక్ మేనేజర్ లు ప్రకాష్ ,హన్మంత్ రావు ,తదితరులు పాల్గొన్నారు .
నీటి సంరక్షణ అందరి బాధ్యత ; జిల్లా పాలనాధికారి చంపాలాల్
నీటి సంరక్షణ అందరి బాధ్యత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 22 ; సమస్త జీవకోటి మానవాళి నీటి మీదా ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అలాంటి నీరుని కాపాడుకోవలిసిన భాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా పాలనాధికారి చంపాలాల్ అన్నారు ప్రపంచ జలదినోత్సవం సంధర్భంగా బుధవారం రెబ్బన మండలంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు . ప్రపంచంలో మూడువంతులు నీరు ఒకవంతు భూమి ఉనప్పటికీ త్రాగునీరు మాత్రం 0. 3% ఉన్నదని అలాంటి త్రాగునీరును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు . భావితరాలకు నీటికొరత రాకుండా ఉండాలంటే నీటిని దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవాలని సూచించారు . తెలంగాణప్రభుత్వం మిషన్ కాకతీయ ,మిషన్ భగీరథ పథకాలద్వారా భావితరాల భవిష్యత్తును దృష్టిలోఉంచుకొని కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు . జిల్లాకు అనుసంధానంగా ఉన్న రెబ్బన ఎల్లమ్మ చెరువును మినీట్యాంకుబండ్ గ ఏర్పాటు అయ్యేలా కృషిచేస్తామని ,సమీపప్రాంతంలో ఉద్యానవనం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా నీటి ప్రతిజ్ఞను సమావేశంలో ఉన్న నాయకులు ,విద్యార్థులతో చదివించారు. ప్రతిజ్ఞ నను నీటిని సంరక్షిస్తానని పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను నీటి వినియోగంతో ఔ చైత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదను గుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం నీరు వృధా కాకుండా చూడటంలో న కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే దానిని సంరక్షించుకునే బాధ్యత మన ఫై ఉందని ప్రతిజ్ఞ చేసారు . ఈ కారక్రమంలో జడ్పీటీసీ అజ్మీర బాపూరావు, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ , స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ,తహసీల్దార్ రమేష్ గౌడ్ ,వైస్ ఎంపీపీ గుడిసెల రేణుక ,సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ ,ఏపీఎం వెంకటరమణ శర్మ ,ఎపిఓ కల్పన ,తెరాస నాయకులు నవీన్ కుమార్ జైష్వాల్,చిరంజీవి గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ ,మధునయ్య ,పల్లె రాజేశ్వర్ ముదిరాజ్ సంఘ నాయకులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
Tuesday, 21 March 2017
ప్రభుత్వ భూమిని సందర్శించిన కలెక్టర్
ప్రభుత్వ భూమిని సందర్శించిన కలెక్టర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; రెబ్బెన లోని ఇందిరానగర్ ప్రభుత్వ భూమిని కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మంగళ వారం రోజున సందర్శించారు . పోలీస్ క్వాటర్ల కోసం భూమిని పరిశీలించి ఆనంతరం తహశీల్ధార్ కార్యాలయములో కూర్చొని తహశీల్ధార్ రమేష్ గౌడ్ తో ప్రభుత్వ భూమి వివరాలు అడిగి తెలుసు కొన్నారు . రికార్డులను పరిశీలించారు . ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని తెలిపారు.
కస్టపడి చదివి ఎంపికైన ; హార్టికల్చర్ అధికారిగా ఎం ఏ నదీం
కస్టపడి చదివి ఎంపికైన ;ఎం ఏ నదీం
హార్టికల్చర్ అధికారిగా ఎం ఏ నదీం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; జిల్లా హార్టికల్చర్ అధికారిగా నదీం ఎంపికయ్యారు . స్థానిక విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు . రెబ్బెన గ్రామానికి చెందిన నదీం ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యాభ్యసించారు స్థానిక జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూప్ లో ఇంటర్ పూర్తి చేసారు. 2008 ఎం సెట్ లో రాష్ట్ర స్థాయిలో 40725 ర్యాంకు సాధించి వైఎస్ ఆర్ యునివేర్సిటి లో బిఎస్ సి హార్టికల్చర్ పూర్తి చేసారు. టీఎస్ పీఎస్ సి నిర్వహించిన పరీక్షల్లో 450మార్కులకు 300 మార్కులు సాధించారు 20/3/2017 టీఎస్ పీఎస్ ప్రకటించిన ఫలితాలలో ఉద్వన అధికారిగా ఎంపికయ్య్యారు. నదీంను స్థానిక ఎంపీపి సంజీవ్ కుమార్, జెడ్పిటిసి బాబురావు సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ బి శ్రీధర్, మండల్ తెరాస అధ్యక్షులు పి శ్రీధర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎం ఏ జాకీర్ ఉస్మాని, మోడెం సుదర్శన్ గౌడ్, జిల్లా ప్రైవేట్ పాఠశాల స్సంగం అధికార ప్రతినిధి దీకొండ సంజీవ్ కుమార్, బెజ్జుర్ ఏ.పి.ఓ ఎం ఏ. షాకీర్ ఉస్మాని, ఆసిఫాబాద్ ఏ.పి.ఓ చంద్ర శేఖర్, రెబ్బెన డిగ్రీ కలశాల ప్రింసిపల్ అమీర్ ఉస్మాని లు అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన వనాలు , పండ్ల తోటలు పెంపకం కోసం అభివృద్ధి చేయటానికి శాయ శక్తుల కృషి చేస్తానని ఎం ఏ నదీం అన్నారు. ఎం ఏ నయీమ్ రెబ్బెన గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ పిల్లకు చదివించారు. ప్రస్తుతం నదీం ఆసిఫాబాద్ మండలంలో ఉపాధి హామీ పథకంలో ఇంజనీర్ కన్సల్టెంట్ గ విధులు నిర్వహిస్తున్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బిక్షాటన
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బిక్షాటన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించి పేర్మినెంట్ చెసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎ ఐ టి యు సి బ్రాంచ్ అద్యక్యుడు బోగే ఉపేందర్ అన్నారు. మంగళ వారం రెబ్బెన మండలం లోని గోలేటిలో బిక్షాటన చేశారు అనంతరం మాట్లాడుతూ సింగరేణి మరియు ఓపెన్ కాస్ట్ ఓబీ లలో ఒప్పంద పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేక పోతేఆందోళన కార్యక్రమాలు చేపడతామని .సింగరేణి లో అస్సలు ఒప్పంద కార్మికులే లేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ అనడం చాల బాధాకరం అని ఆయన అన్నారు. అదే విధంగా హైపవర్ కమిట వేతనాలు అమలు చేయాలనీ,బోనస్ చట్టం ప్రకారమా ఒప్పంద కార్మికులకు 8.33శాతం బోనస్ చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ లలో స్థానిక నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని,ఒప్పంద కార్మికులకు సింగరేణి యూనియన్ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. హెచ్ పి సి వేతనాల గురించి బోనసులు ఎన్ సి డబ్ల్యూ ఎ వర్తింపుల పై మరియు కాంట్రాక్ట్ కార్మికుల పర్మినేట్ చేయడం కొరకు పర్మింట్ కోటర్స్ కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు రాయిలా నర్సయ్య, బండారు తిరుపతి,చల్లూరి అశోక్, రామస్వామి , మొగిలి ఐఫ్టీయూ చంద్ పాషా , సికిందర్ కార్మికులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; ప్రభుత్వ పథకాలను ప్రజలలోనికి తీసుకెళ్లాలని గ్రామా సర్పంచ్ పెసర వెంకటమ్మ, తెరాస జిల్లా మహిళా కార్యదర్శి కుందారపు శంకరమ్మలు అన్నారు . మంగళ వారము ఆమె రెబ్బెనలో, గోలెట్ ఖైర్ గూడలో సభ్యత్వ నమోదు చేపట్టారు . అనంతరము మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని వాటిని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు . ఆసరా పథకం , షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి , తదితర పథకాలను ప్రభుత్వం అందించిందని తెలిపారు . త్రాగు నీరు , రోడ్లు , గ్రామ గ్రామ న ఏర్పాటు చేస్తున్నట్లు , గ్రామాల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అని అన్నారు .
మండలంలో అభివృద్ధి పనులు భూమి పూజ
మండలంలో అభివృద్ధి పనులు భూమి పూజ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; రెబ్బెన ,వంకులంలో మంగళవారం సీసీ రోడ్ లకు ఎంపీపీ సంజీవ్ కుమార్ జడ్పీటీసీ బాబురావు లు భూమి పూజ చేసారు. అన్తరం రాలపేట లో త్రాగు నీటి పంపు ను ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పతకాలను అభువృద్ది కార్యక్రమాలను చేపడతామంన్నారు. గ్రామాల అభివృద్ధి అయితేనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఏఎంసీ శంకరమ్మ, మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
రెబ్బెనలో భూకబ్జాలపై సి ఐ విచారణ
రెబ్బెనలో భూకబ్జాలపై సి ఐ విచారణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; కొమరంభీం జిల్లాలోని రెబెన మండలం లో పులికుంట గ్రామంలో 123/1 సర్వేనెంబర్ గల భూమి దొంగ రిజిస్ట్రేషన్ చేయించారని ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ కు ప్రజా పిర్యదు విభాగం లో బొమ్మినేని లక్ష్మి విన్నపించగా ఎస్ పి ఆదేశాల మేరకు మంగళవారం సి ఐ మదన్ లాల్ విచారనాలో భాగంగా హద్దులు మర్చి సర్వే నెంబర్ మర్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించినట్లు బొమ్మినేని లక్ష్మి సి ఐ మదన్ లాల్ కు సంభందిత పత్రాలు చూపించి వారి యొక్క భాదను తెలియజేసారు. సి ఐ మదన్ లాల్ ఇరువురిని పిలిచి విచారించారు. ఇట్టి విషయంన్ని రెబ్బెనకు విచ్చేసిన కలెక్టర్ చంపాలాల్ దృష్టికి తీసుకెళ్ళగా తహసీల్దార్ రెండు రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా సొంత పట్టాదారు బొమ్మినేని లక్ష్మి తన సొంత భూమిని కొంత మంది రియల్ ఎస్టేట్ దందా నడుపు తున్న వారు దొంగ పట్టాలు చేసి తమకు అన్యాయం చేస్తున్నారని ఓ పత్రిక ప్రకటలో తెలిపారు సంభందిత అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
Saturday, 18 March 2017
సింగరేణి క్రీడా కారులను ప్రోత్సహిస్తుంది ; జీఎం రవి శంకర్
సింగరేణి క్రీడా కారులను ప్రోత్సహిస్తుంది ; జీఎం రవి శంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 18 ; సింగరేణి కార్మికుల సంక్షేమం తో పాటు క్రీడా కారుల ను ప్రోత్సహిస్తుందని జీఎం రవి శంకర్ అన్నారు శనివారం రెబ్బెన మండలం లోని శ్రీ భీమన్న స్టేడియం లో స్వర్గీయ వేణు గోపాల్ జ్ఞాపకార్థం వాలీబాల్ మరియు ఫుట్ బాల్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జనరల్ మానెజెర్ రవి శంకర్ ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడారు సింగరేణి సంక్షేమంతో పాటు కార్మికుల మరియు వారి కుటుంబ సభ్యులకు విద్య తో పాటు క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలోని నైపుణ్యాలను గుర్తించి బహుమతులు అందజేయడాం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమం స్వర్గీయ వేణు గోపాల్ స్మారకార్థం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత ముపై సంవత్సరాల క్రితం ఈయన మార్గం ఫీట్ లో ఓవర్ మెన్ పనిచేస్తున్నప్పుడు గ్యాస్ లీకేజీ ని గమనించి తోటి కార్మికులను కాపాడే ప్రయత్నం లో మరణించారని అందుచే జ్ఞాపకార్థం ఈ కక్రీడా పోటీలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. హుజారాబాద్,హైదరాబాద్,దేవాపూర్,గోలేటి జట్టుల మధ్య క్రీడా పోటీల జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ జె చిత్రంజన్ డీవై పీఎం రాజేశ్వర్, టిబిజికె ఎస్ నాయకులూ సద శివ, ఏఐటీయూసీ బ్రాంచ్ సేకరెట్రీ ఎస్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Friday, 17 March 2017
ప్రారంభమైన పదోవ తరగతి పరీక్షలు
ప్రారంభమైన పదోవ తరగతి పరీక్షలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 17 ; పదోవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం అయ్యాయి.పరీక్షల కోసం రెబ్బెన మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 404 మంది హాజరు కావాల్సి ఉండగా 403 మంది విద్యార్థులు హాజరై, ప్రశాంతంగా జరిగినట్లు ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి తెలిపారు. రెబ్బెన జిల్లా పరిషత్,గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్షా తొలి రోజు విద్యార్థులు హాజరు అయ్యారు.పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయ్యింది. పరీక్షా కేంద్రాలలో తాగునీటి,మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వార్డ్ మల్లయ్య తనిఖీ చేసారు.అభివృద్ధి బాటలో సంక్షేమ తెలంగాణ ; జడ్పీటీసీ బాబు రావు
అభివృద్ధి బాటలో సంక్షేమ తెలంగాణ ; జడ్పీటీసీ బాబు రావు
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్క రించే వరకు ఆందోళన కార్యాక్రమలు చేపడతాం ; బోగే ఉపేందర్.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్క రించే వరకు ఆందోళన కార్యాక్రమలు చేపడతాం ; బోగే ఉపేందర్.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 17 ; సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించి పేర్మినెంట్ చెసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎ ఐ టి యు సి బ్రాంచ్ అద్యక్యుడు బోగే ఉపేందర్ అన్నారు. శుక్రువారం రెబ్బెన మండలం లోని గోలేటి ప్రధాన రహ దారి ఫై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణి మరియు ఓపెన్ కాస్ట్ ఓబీ లలో ఒప్పంద పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేక పోతేఆందోళన కార్యక్రమాలు చేపడతామని .సింగరేణి లో అస్సలు ఒప్పంద కార్మికులే లేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ అనడం చాల బాధాకరం అని ఆయన అన్నారు. అదే విధంగా హైపవర్ కమిట వేతనాలు అమలు చేయాలనీ,బోనస్ చట్టం ప్రకారమా ఒప్పంద కార్మికులకు 8.33శాతం బోనస్ చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ లలో స్థానిక నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని,ఒప్పంద కార్మికులకు సింగరేణి యూనియన్ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. హెచ్ పి సి వేతనాల గురించి బోనసులు ఎన్ సి డబ్ల్యూ ఎ వర్తింపుల పై మరియు కాంట్రాక్ట్ కార్మికుల పర్మినేట్ చేయడం కొరకు పర్మింట్ కోటర్స్ కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు రాయిలా నర్సయ్య, బండారు తిరుపతి,చల్లూరి అశోక్, రామస్వామి , మొగిలి ఐఫ్టీయూ చంద్ పాషా , సికిందర్ కార్మికులు పాల్గొన్నారు.
Wednesday, 15 March 2017
కాంట్రాక్టు కార్మికులసమస్యలను పరిష్కరించాలని ధర్నా
కాంట్రాక్టు కార్మికులసమస్యలను పరిష్కరించాలని ధర్నా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 15 ; సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని బుధవారం రెబ్బెన మండలం లోని గోలేటి జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . ఏఐటీయూసీ బోగే ఉపేందర్ మాట్లాడుతూ చాల కాలం నుండి తక్కువ వేతనం కు పనిచేస్తన్నమని వేజ్ బోర్డు లో ఒప్పందం జరిగిన మొదటి క్యాటగిరి వేతనాన్నివెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే స్వరాష్ట్రం లో కూడా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు.కాంట్రాక్టు కార్మికులను పెర్మనెంట్ చేస్తా అని అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ ఎన్నికల సందర్బంగ ఇచ్చిన హామీ ని వెంటనే నెరవేర్చాలని అన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమ్మె లో కాంట్రాక్టు కార్మికులు రాయిలా నర్సయ్య, బండారు తిరుపతి,చల్లూరి అశోక్, రామస్వామి , మొగిలి ఐఫ్టీయూ చంద్ పాషా , సికిందర్ కార్మికులు పాల్గొన్నారు.
పేదలకు వెన్నంటే ఉండే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం ; ఎమ్మెల్యే కోవా లక్ష్మి
పేదలకు వెన్నంటే ఉండే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం ; ఎమ్మెల్యే కోవా లక్ష్మి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 15 ; తెరాస ప్రభుత్వం పేదలకు వెన్నంటే ఉంటూ సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అందించలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు బుధవారం తహశీల్ధార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి పథకం కింద పలువురికి చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ నిరుపేదలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరెన్నో సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం అందించా లేని విధంగా అందించడం తెలంగాణ ప్రభుత్వం ఘనతే అని అన్నారు. దళితులకు, మైనారిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు . యాదవులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు ,ఒక పొట్టేలు ఇవ్వడం జరుగుతుందని 75 శాతం సబ్సిడీని ఇచ్చి ప్రభుత్వం అదుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావు ,తహశీల్ధార్ రమేష్ గౌడ్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుందారపు శంకరమ్మ ,సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మేన శ్రీధర్ ,ఎంపీటీసీ వనజ ,ఏఎంసీ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ .మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి ,నాయకులు అశోక్, చిన్న సోమశేఖర్, సుదర్శన్ గౌడ్,మడ్డి శ్రీనివాస్ ,మదనయ్య ,సురేష్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 14 March 2017
గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 14 ; గ్రామాల అభివృద్దే రాత్రి ప్రభుత్వ లక్ష్యమని ఎం ఎల్ ఏ కో వ లక్ష్మి అన్నారు మంగళ వారం గంగ పుర రోడ్డు కి కొబ్బరి కే కొట్టి ప్రారంబించారు అనంతరం జ్యోతిబాపులే విగ్రహానికి విగ్రహానికి భూమి పూజ చేశారు . అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని అన్నారు త్రాగు నీటి కోసం, ,మురికి కాలువల నిర్మాణం కోసం కృశీ చేస్తున్నామని తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈకరూప దుస్తులను పంపిణి చేశారు. మండల విద్యశాఖాధికారి వెంకటేశ్వరస్వామి,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, సర్పంచులు వెంకటమ్మ,సుశీల,నాయకులు నవీన్ కుమార్ జైస్వాల్ చెన్న సోమశేఖర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్,చిరంజీవి గౌడ్, రాపర్తి అశోక్,విద్యార్థులు పాల్గొన్నారు..
విధ్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణి
విధ్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 14 ; రెబ్బెన మండలం పులికుంట కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రెబ్బెన మండల తహశీల్ధార్ బండారీ రమేష్ గౌడ్ తన కుమారుడు స్మారకార్థం క్రీడా సామాగ్రిని,దుస్తులను,నోటు పుస్తకాలను అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ముఖ్య అతిధిగా హాజారు అయ్యారు. అదే విదంగా పులికుంట రోడ్డు పాఠశాలలో భాజపా నాయకుడు గుల్భము చక్రపాణి,శ్రీపతి,రంగు మహేష్ గౌడ్ విధ్యార్ధులు కూర్చోడానికి బెంచీలు అందజేశారు.ఈ సందర్భoగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి.తహశీల్ధార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవచేయడం చాల సంతోషoగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యశాఖాధికారి వెంకటేశ్వరస్వామి,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, సర్పంచులు వెంకటమ్మ,సుశీల,నాయకులు నవీన్ కుమార్ జైస్వాల్, చెన్న సోమశేఖర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్,చిరంజీవి గౌడ్, రాపర్తి అశోక్, ఇప్ప భేమేష్,రంగు మహేష్ గౌడ్,శ్రీపతి,ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్,లక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 14 ; ప్రతిభ పరీక్షలో గెలుపొందిన వారికీ ఎస్ ఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన జెట్ పి హెచ్ ఎస్ లో బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిఐ మదన్ లాల్, ఎం ఈ ఓ వెంకటేస్వర స్వామిలు హాజరై మాట్లాడుతూ ప్రతిభ పరీక్షలతోనే విద్ద్యార్థుల మేధా శక్తిని వెలికితీయవచ్చని అన్నారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేయడం ద్వారా విద్యార్థులు ఉత్సాహవంతులు అవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత,దేవ్ లాల్,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థి నాయకుడు దుర్గం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 14 ; ప్రతిభ పరీక్షలో గెలుపొందిన వారికీ ఎస్ ఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన జెట్ పి హెచ్ ఎస్ లో బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిఐ మదన్ లాల్, ఎం ఈ ఓ వెంకటేస్వర స్వామిలు హాజరై మాట్లాడుతూ ప్రతిభ పరీక్షలతోనే విద్ద్యార్థుల మేధా శక్తిని వెలికితీయవచ్చని అన్నారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేయడం ద్వారా విద్యార్థులు ఉత్సాహవంతులు అవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత,దేవ్ లాల్,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థి నాయకుడు దుర్గం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ డోర్లీ -1 ఉప ఫిట్ కార్యదర్శిగా వి.మదన్
ఏఐటీయూసీ డోర్లీ -1 ఉప ఫిట్ కార్యదర్శిగా వి.మదన్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 14 ; బెల్లంపల్లి ఏరియా డోర్లి ఉపరితల గని ఏఐటీయూసీ ఫిట్ ఉప కార్యదర్శిగా ఈపీ ఆపరేటర్ వి.మదన్ ను ఎన్నుకోవడం జరిగిందని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,డోర్లి-1 గని ఫిట్ కార్యదర్శి నర్సింహా రావు తెలియజేశారు.అదే విధంగా రిలే -A ఇంఛార్జిగా బి.శ్రీనివాస్,రిలే-B ఇంఛార్జిగా అంబాలా ఓదెలు,రిలే-C ఇంఛార్జిగా వెంకన్న,జనరల్ షిఫ్ట్ ఇంఛార్జిగా చుంచు రాజన్న,బేస్ వర్క్ షాప్ ఇంచార్జిగా చంద్రయ్య,మైన్స్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సోమవారంనాడు రెబ్బెన మండలం గోలేటిలోని కేఎల్ మహేంద్రభవన్ లో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సమస్యలు ఒక్క ఏఐటీయూసీతోనే తీరుతాయని ఆయన అన్నారు.అవగాహణ లేని టీబిజీకేఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమై,యూనియన్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలతో ద్వారా సమావేశాలు నిర్వహించే స్థితికి చేరిందని ఆయన విమర్శిoచారు.కార్మికులను మరల మోసం చేసేందుకు సిద్ధమవుతున్న టీబిజీకేఎస్ కు కార్మికులే బుద్ధి చేప్తారని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులూ బి.జగ్గయ్య,శేషు,జూపాక రాజేష్,నర్సింహారావు,చక్రధర్,కిరణ్బాబు,భిక్షమయ్య,ఎం.సత్యనారాయణ,దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Monday, 13 March 2017
కార్మిక సమస్యలు పరిష్కారం లో గుర్తింపు సంఘం విఫలం
కార్మిక సమస్యలు పరిష్కారం లో గుర్తింపు సంఘం విఫలం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; సింగరేణి గుర్తింపు సంఘం గ ఉన్న టిబిజికెఎస్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో విఫలం అయిందని గుర్తింపు సంఘం టిబిజికెఎస్ 4 సంవత్సరాలుగా కళాపరిమితులో అంతర్గత గొడవలు తప్ప కార్మికుల కు చేసింది ఏమి లేదని అన్నారు సోమవారం నాడు రెబ్బన లోని గోలేటి సివిల్ డిపార్ట్మెంట్ జేఏసీ అద్వర్యం లో ధ్వారాసమావేశం లో నిర్వహించి మాట్లాడారు టిబిజికెఎస్ ఫారంగా విఫలం అయిందని అన్నారు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైకరిని నిరసిస్తూ సింగరేణి కాంట్రాక్ కార్మికులకు జేఏసీ అధ్వార్యంలో మార్చి15 నుండి నిర్వాధికా సమ్మె జరుగుతుందని అన్నారు కాంట్రాకు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరు లేరని అనడం చాల బాధాకరం అన్నారు ఇప్పటికైనా కోల్ బెల్ట్ పరికరం ఎంసీ ఏ లు జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేసే విధంగా ఈ కార్యక్రమంలో సుధాకర్.సాగర్ గౌడ్.నర్సయ్య. తిరుపతి. సికిందర్బ్.ప్రవీణ్ .వెంకటేశం.తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్నకలప పట్టివేత
అక్రమంగా తరలిస్తున్నకలప పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; అక్రమంగా తరలిస్తున్న కలప సామాన్లను ఆదివారం రాత్రి తిర్యాణి నుంచి మంచిర్యాల వైపు టీఎస్ 01 యూ బి 7914 గల బొలోరో వాహనం లో తరలిస్తుండగా డీఎఫ్ ఓ వెంకటేశ్వర్లు సమాచారమేరకు రెబ్బన మండలం లోని గోలేటి క్రాస్ వద్ద స్వాధీన పరుచుకున్నట్లు అటవి క్షేత్ర అధికారి రాజేందర్ ప్రసాద్, డీ అర్ ఓ కే శ్రీనివాస్ లు తెలిపారు. కల్పసమాగ్రి మంచాలు టేబుళ్లు ఉన్నట్లు వీటి విలువ 21 6 53 ఉంటుందన్నారు. వీరితో పటు ఆశిశ్టెంట్ బీట్ అధికారి రవి తదితర సిబ్బంది లు ఉన్నట్లు తెలిపారు.
యాదవులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
యాదవులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; తెలంగాణ ప్రభుత్వ యాదవ కులస్థులు గొర్రెలు మేకలు పెంపకం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి రెబ్బన మండల యాదవ కులస్థులు అందరూ పాలాభిషేకం చేసారు ఈ సందర్బంగా యాదవ కులస్థుల కొమురం భీం జిల్లా కార్యదర్శి పలగాని పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రకటించని విధానం గ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు రాయితీ ఫై గొర్రెలు మేకలలు పెంపకం కోసం నాలుగు వందల కోట్లు మంజూరు చేయటం గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమ లో ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సుదర్శన్ గౌడ్ ,సోమశేఖర్ ,సత్యనారాయణ, ఎం శ్రీనివాస్ గౌడ్ యాదవుల రెబ్బన మండల అధ్యక్షుడు జగిరి చెంద్రయ్య యాదవ్ , మండల యూత్ అధ్యక్షుడు ఎర్రవెని వెంకటేష్ యాదవ్ ,కోట సుభాష్ యాదవ్ ,శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
జాగృతి ఆద్వర్యంలోకవిత జన్మదిన వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; తెలంగాణ జాగృతి వ్వవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భముగా తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షుడు రంగు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రెబ్బన అతిధి ఆవరణ గృహం లో జన్మదిన వేడుకలు జరిపారు . ముందుగా కేక్ కట్ చేసి కవితక్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షుడు రంగు మహేష్ గౌడ్ మాట్లాడుతూ యూవతకు ఉపాధి తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ అన్నిరంగాలలో మహిళలకు ఉపాధి కల్పిస్తూ అందరికి మైలు రాయి గా నిలిచింది అన్నారు. అలాగే మన రాష్టం లోనే కాకా ఇతర రాష్టాలలోను మన సంప్రదాయాలను తెలియజేయడానికి కృషి చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,సుదర్శన్ గౌడ్ ,సోమశేఖర్ , ఎం శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, పర్వతాలు, మహిళా నాయకురాలు బోయిని శంకరమ్మ ,బొంగు దేవక్క , పద్మ , ఆత్రం లక్ష్మి , గన్న లక్ష్మి , కుమ్మరి రాజక్క , పొసక్క పాల్గోన్నారు.
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులో అన్యాయం ; దుర్గం రవీందర్
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులో అన్యాయం
ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,49,446 కోట్ల రూ..ల్లో విద్యారంగానికి 12,705 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని KG to PG ఉచిత విద్యకు కేటాయింపుల్లో నిధులు కేటాయించకపోవడం విశ్వవిద్యాలయాల విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ,ఫీజు రీయింబర్స్ మెంట్ కు కావలసిన 3 వేల కోట్లు కేటాయించకపోవటం, గత ఆంధ్ర పాలకులు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే చాలా దారుణంగా ఈ బడ్జెట్ ఉందని ఈ బడ్జెట్ వల్ల విద్యారంగానికి ఒరిగింది ఏమి లేదని ,రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 10 శాతానికి మించి కేటాయింపులు జరగడం లేదని ఈ బడ్జెట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కుమురం భీం జిల్లా సమితి పక్షాన తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత ప్రవేశ పెట్టిన 4వ బడ్జెట్ లో కూడా విద్యారంగానికి నిరాశ మిగిలిందని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శతబ్ది ఉత్సవాలకు కేవలం రెండు వందల కోట్లు కేటాయించడం దారుణమని, విశ్వవిద్యాలయాల సమగ్ర అభివృద్ధికి ఐదు వందల కోట్లు అవసరం ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విశ్వవిద్యాలయాల విద్యార్థుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతుందని కె.జి టూ పి.జి. ఉచిత విద్యకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కేవలం గురుకులాల ఏర్పాటు ద్వారానే కె.జి. టూ పి.జి. సాధ్యం కాదని ప్రత్యేకంగా దాని అమలుకు యబై వేల కోట్లు కేటాయించవలసిన అవసరం ఉందన్నారు.పెండింగ్ స్కాలర్ షిప్స్ రియింబర్స్ మెంట్ కు ఈ విద్యాసంవత్సరానికి కలిపి మూడు వేల కోట్లు అవసరం ఉండగా కేవలం 1,939 కోట్లు మాత్రమే కేటాయించారని పూర్తి స్థాయిలో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ చూస్తే దళితులను,గిరిజనులను,బి.సి.,మైనారిటీలను విద్యకు దూరం చేసే విధంగా ఉన్నదని,గత బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయి ,నాయకులు ప్రశాంత్ ,శరత్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)