తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరపండి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); కేసియర్ కళలు కన్నా బంగారు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని జూన్ రెండున ఘనంగా జరుపుకోవాలని యంపిపి సంజీవ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం రోజున రెబ్బెన యంపి డి ఒ కార్యాలయంలో మండల అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూన్ రెండొవ తేదిన జరుపుకునే తెలంగాణ ఆవిర్బావ సంభారాలను అధికారులు సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగులు అందరు వారివారి కార్యాలయాలలో పారిశుధ్య పనులు చేయింఛి అందమైన రంగురంగుల విద్యుత్ దీపాలతో కార్యాలయ భవనాలను అలంకరించు కోవాలని ప్రతి ఒక గ్రామపంచాయతిలో 25కిలోల మిట్టాయిలను పంచాలని కోరారు . అనంతరం ముఖ్యాతితిగా విచ్చేసిన జడ్ పి టి సి బాబురావు ,పర్యవేక్షణ అధికారి తహసిల్దార్ రమేష్ గౌడ్ మరియు యంపి డి ఒ లక్ష్మినారాయన లు మాట్లాడుతూ ఒక్క రోజు జరుపుకునే తెలంగాణ సంబరాలు ఉదయం 8గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాలలో పథాక ఆవిష్కరణ చేయాలి . తెలంగాణ తల్లి విగ్రహాలకు ,తెలంగాణ అమర వీరులస్థూపాలకు పూలమాలలు వేసి నివ్వాళ్ళు అర్పించాలన్నారు . అలాగే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోని పంచాయతి పరిధిలో మహిళలకు ముగ్గుల పోటిలు,పాటల పోటీలు నిర్వయిం చాలని తెలిపారు . అదేవిధంగా అధికారులు ,ప్రభుత్వ ఉద్యోగులు ,మహిళలు ప్రతి ఒక్కరు తమవంతు భాద్యత వహింఛి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ఎపియం లు వెంకటరమణ ,రాజ్ కుమార్ పంచాయితీరాజ్ ఏ ఈ జగన్ ,ఎపిఒ కల్పన ,ఇసిడియస్ సూపర్ వేజర్ లక్ష్మి ,అర్ డ బ్ల్యు సోని ,యంపిటిసిలు మండల సర్పంచులు తదితరలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment