Thursday, 12 May 2016

లోవోల్టేజితో ఇబ్బందితో గ్రామస్తులు విద్యుత్ కేంద్రం ముట్టడి

 లోవోల్టేజితో ఇబ్బందితో గ్రామస్తులు విద్యుత్ కేంద్రం ముట్టడి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని పున్జుమేరగుడా గ్రామంలో గత ఏడాది  నుండి లోవోల్టేజి  విద్యుత్ సమస్య ఉందని గ్రామస్తులు గురువారం రోజున మండల కేంద్రం లోని విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసి వినతి అందచేసారు   అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గత ఏడాది  నుండి విద్యుత్ లోవోల్టేజి  సమస్యతో  ఫాన్స్ ,కూలర్లు తిరగడం లేదు దిని వలన దోమలు ఎక్కువగా కుట్టి గ్రామంలోని  ప్రజలు రోగాలబారిన పడుతున్నారు మరియు ప్రతి రోజు రాత్రి పుట  ట్రాన్స్ ఫోరమ్ దగ్గర ఫుజ్ ఎగిరిపోతే  వేయడానికి అధికారులు అందుబాటులో లేక రాత్రిలు కరెంట్ లేని రోజులు ఎన్నో ఉన్నాయి  విద్యుత్ అధికారులు స్తానికంగా ఉండకుండ మండల ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు.   ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని  కోరారు.  తెరాస నాయకులూ మోడెo  సుదర్శన్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ లు  విద్ద్యుత్ అధికారి ని  పురాణం సతీష్ తో చరవాణిలో  సంబాశించి  వారంరోజులలో సమస్యను పరిష్కరిస్తామని ఇప్పడినుంది పనులు చేపడతామని  అనడంతో గ్రామస్తులు ఇంటిముఖం  పట్టారు.  ఈ నిరసన లో కాంతారావు   వడయి గణపతి ,మొర్లె  నరసింహ, వడయి  గోవింద్ ,గుర్లె విస్సయ్య ,గుర్లె బాపు, నికోడే బాపూరావు, అరె తులసిరాం , నగోస శంకర్ ,రవీందర్, మధుకర్, నరేష్ ,రమేష్, పోచయ్య ,పాపయ్య, కాశయ్య ,కాంతారావు  తదితర గ్రామస్తులు ఉన్నారు. 

No comments:

Post a Comment