మైనార్టీల అభివృద్ధి తెరాస తో సాధ్యం
(రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన మండలం లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తో సాధ్యం అవుతుందని అలాగే మైనార్టీ ల సంక్షేమం కోసం పాటుపడుతుందని మండల కో ఆప్షన్ సభ్యులు యమ్. ఏ జాకీర్ ఉస్మాని అన్నారు.శనివారము విలేకర్లతో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ కు 12% రిజర్వేషన్ , షాది ముబారక్ , ఎస్ టి, ఎస్ సి , బి సి లకు కళ్యాణ లక్ష్మి 51,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరమని స్థానిక ఎం .ఎల్.ఎ. కోవ లక్ష్మి , ఆదిలాబాద్ ఎమ్. ఎల్. సి. పురాణం సతీష్ కుమార్ రెబ్బెన మైనార్టీ అభివృద్ధి కొరకు ఇప్పటికే 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని త్వరలో షాదిఖాన కొరకు ప్రభుత్వ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఖబ్రస్తాన్ ప్రహరి గోడ పనులకు త్వరలోనే ఎం .ఎల్.ఎ. మరియు ఎమ్. ఎల్. సి లచే శంఖు స్థాపన చేయనున్నట్లు తెలిపారు . ముస్లిం లకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అందుకే తెరాస పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు .ఈ సమావేశంలో తెరాస యూత్ నాయకులు డి. వెంకటేష్ , అన్సారీ , ఇమ్రోజ్ , జాఫర్ ఆలి , ఆరిఫ్ పాల్గొన్నారు .
No comments:
Post a Comment