హక్కుల సాధన లో టీ బీ జీ కే ఎస్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టి బి జీ కీ ఎ స్ సింగరేణి కార్మికుల హక్కులను సాదించడంలో ముందంజలో ఉందని టి బీ జీ కీ ఎస్ ఏ రియ ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్ అన్నారు బెల్లంపల్లి ఏ రియా లో ని గోలేటి లో తెలంగాన్ భవన్ లో సోమవారం వేలేకరుల సమావేశంలో మాట్లాడుతూ . 3100 మంది డిపెండెంట్ కార్మికులకు ఒకేసారి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. సకల్ జనుల సమ్మె వేతనాలను మే నెలలో ఇప్పించండం కోసం అంగీకారం జరిగిందన్నారు.పిఎమీ కోసం వెళ్ళడానికి మాస్టర్ ఇప్పించామని తెలిపారు రిటైర్డ్ కార్మికుల సన్మానం కోసం ఖర్చును రూ 900 వందల నుంచి 3500 పెంచడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో వారసత్వ ఉద్యోగాలు సైతం సాదించి తీరుతామని పేర్కొన్నారు ఈ సమావేశంలో గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ ఏరియా అర్గ నైజింగ్ కార్యదర్శి ఎం కుమార స్వామి పిట్ కార్యదర్శులు కె యాదగిరి బీ వెంకటస్వామి ముద్దం శంకర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment