జిల్లా స్థాయి చెస్ పోటిలకు ఎంపికైన నవనీత్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); జిల్లా చెస్ చాంపియన్ షిప్ రెబ్బెన మండలం గోలేటి గ్రామానికిచెందిన సంమిడ్ల నవనీత్ సాధించినట్లు జిల్లా అసోసియేషన్ డేలప్ మెంట్ చైర్మెన్ యస రాజిరెడ్డి తెలిపారు మంచిర్యాల్ పట్టణంలోని రివిలేషన్ హైస్కూల్ లో జిల్లా స్థాహి అండర్ 11 13 ఓపెన్ విభాగాల్లో చెస్ చాంపియన్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అండర్ 11విభాగంలో ఐదు రౌండ్లలో ప్రతిభ చూపి జిల్లా చెస్ చాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్నడు. ఈ నెల 28,29 తేదిల్లో హైదరాభాద్ లో నిర్వహించే అంతర్ జిల్లా చెస్ చాంపియన్ పోటిల్లో నవనీత్ పాల్గొననున్నట్లు తెలిపారు సంమిడ్ల నవనీత్ ని జెడ్పిటిసి బాబురావు ,యంపిపి సంజీవ్ కుమార్ మరియు తదితర నాయకులు అందరు ప్రత్యేక అబినందనలు తెలుపుతూ జరుగ బోయె రాష్ర్ట స్థాయి పోటిలలో విజయం సాదించాలని అన్నారు.
No comments:
Post a Comment