అక్రము ఇసుక రవాణాను నివారించడంలో రెవెన్యూ అధికారులు విఫలం -బోగే ఉపేందర్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); అక్రము ఇసుక రవాణాను రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం సరికాదని ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు శుక్రవారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు దర్న చేసి తహసిల్దార్ కి వినతి పత్రం అందచేసారు అనంతరం ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్లు మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని నంబాల గ్రామా పంచాయితీ పరిదిలో సింగరేణి సమస్త అద్వర్యంలో నిర్మిస్తున్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ [సి ఎస్ పి] నంబాలవాగు నుంచి అక్రముగా తరలిస్తున్న ట్రాక్టర్, జె సి బి ని, సి పి ఐ నాయకులు రెవెన్యు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అధినంలోకి తీసుకున్నారు కానీ గత మూడు రోజులనుండి కంట్రాక్టర్ శంకరయ్య , జె సి బి, ట్రాక్టర్ యజమానులపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఇసుక అక్రమ పాల్పడ్డ శంకరయ్య రెవెన్యూ అధికారులుచూసి చూడనట్టు వ్యవహరించడం సరికాదు అన్నారు గత కొంత కాలముగా కోట్లాది రూపాయల అక్రము ఇసుక రవాణాను తరలిస్తూన్నారని సి ఎచ్ పి కంట్రాక్టర్ శంకరయ్య ను జె సి బి, ట్రాక్టర్ యజమానులపై వాల్ట చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఇసుక రవాణాను అరికట్టలన్నారు కోట్లాది రూపాయల విలువ గల ఇసుకను అక్రమంగా తరలించిన వారిపై విచారణ జరిపి రికవరీ చేయాలని అన్నారు . ఉన్నంత అధికారులు తక్షణం స్పందించి ఇసుక రవాణాను డిమాండ్ చేసారు. రెబ్బెన తహసిల్దార్ రమేష్ ని వివరణ కోరగా ఫై అధికారులు సిఫార్సు చేసామని ట్రాక్టర్, జె సి బి ని, పోలీస్ వారి కస్టడిలో తీసుకోమని ఆదేశాలు జారి చేసామని కంట్రాక్టర్ శంకరయ్య కు జరిమానా విదిస్తామన్నారు అలానే అక్రమ ఇసుక రవాణా చేయడం నేరమని మొదటిసారిగా పట్టుబడితే జరిమానా విదించి మరోసారి పట్టుబడితే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు ఈ సందర్బముగా ఎ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి జాడి తిరుపతి, ఎ ఐ ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పూదరి సాయి ఎ ఐ టి యు సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment