Wednesday, 11 May 2016

దుమ్ము దూళి రాకుండా చేయాలనీ అన్నారు ---గిరిజన గ్రామస్తులు

  దుమ్ము దూళి రాకుండా చేయాలనీ అన్నారు ---గిరిజన గ్రామస్తులు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి);   సింగరేణి  సి  ఎఛ్ పి  పులికుంట గ్రామంలో ఏర్పాటు చేయడము వలన దుమ్ము దూళి వస్తుందని,  ఆరోగ్యము చెడిపోతుంది అని రెబ్బెన మండలంలోని నంబాల గ్రామా పంచాయితీ పులికుంట  గిరిజన గ్రామస్తులు బుధవారం రోజున జి ఎమ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సింగరేణి జనరల్ మేనేజర్ కి వినతి పత్రం అందచేశారు.  అనంతరం గిరిజన అధ్యక్షుడు  మైలరపు శ్రీనివాస్,ఎమ్ పి టి సి  కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ  సి  ఎఛ్ పి వలన దుమ్ము దూళి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు వస్తాయని తెలుపగా, అప్పటి జి ఎమ్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసి తగిన వసతులు కల్పిస్త మన్నారు. అదే విధముగా సింగరేణి సంస్త ద్వారా మంచి నీరు మరియు రహదారులు అబివృద్ది చేయుటకు మంజూరు  అయిన నిధులు మా యొక్క గ్రామం అయిన పులికుంట లోనే  మంజూరు చేయగలరు మరియు మా యొక్క డిమాండ్లు మా గ్రామంలో మంజూరు అయిన నిధులు పులికుంట లోనే అమలు చేయాలనీ అన్నరు.  అదే విధముగా సి ఎచ్ పి మరియు సంస్త లలో తాత్కాలిక ఉద్యోగాలు గ్రామంలోని గిరిజన యువతకు కల్పించి న్యాయం చేయాలనీ అన్నారు.  తక్షణం గ్రామంలో గ్రామా సభ ఏర్పాటు చేసి భావిష్యతులో దుమ్ము దూళి రాకుండా చేసే చర్యలు మరియు మంచి నిటి వసతి ఏర్పాటు చేయాలనీ గ్రామస్తులు అన్నారు.  ఈ కార్యక్రమంలో చింత పూరి శంకర్ , రమేష్ ,మారయ్య ,గోపాల్ ,ఏర్నటి రమేష్ ,పోషం ,మల్లేష్ ,రాజం ,భీమయ్య ,కిష్టయ్య,శ్రీను ,లింగయ్య  మరియు గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment