Tuesday, 17 May 2016

ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

 ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి  

(రెబ్బెన వుదయం ప్రతినిధి)రెబ్బెన గ్రామా పంచాయితి లో ఇంటింట మరుగుదొడ్లు నిర్మాణ క్రమంలో మంగళ వారం నాడు  వార్డ్  మెంబర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో  సర్పంచ్ పెసరి వెంకటమ్మ మాట్లాడుతూ ఇంటింట మరుగుదొడ్లు నిర్మించాలని నూతనంగా ప్రవేశపెట్టిన ఓ డి ఎఫ్ పథకంలో  ఇంటింటా సర్వే చేసి మరుగుదొడ్లు లేని వారి దరకాస్తులు వాటిని ఎం పి డి ఓ వారికీ పంపిస్తాం అన్నారు. అలానే పారిశుద్యం  లో బాగంగా ప్రతి ఒక కాలనీలో మురికి కాలువలు శుబ్రం చేపిస్తున్నాం అన్నారు.  ఈ సమావేశం లో పంచాయితి కార్యదర్శి మురళీధర్, వార్డ్ మెంబర్లు చిరంజీవి గౌడ్ , ఆత్మకూరి నరేష్ , కళావతి , బొడ్డు యశోద , తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment