Monday, 9 May 2016

ఆకాశంలో అద్భుతాన్నివీక్షించిన యువకులు

   ఆకాశంలో అద్భుతాన్నివీక్షించిన యువకులు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); సూర్యుడి పైన బుదుడి పయనం  మే నవంబర్ నెలలో మాత్రమే కనిపించే ఈ అద్భుతమైన దృశ్యాన్ని సోమవారం  రోజున రెబ్బెన మండలంలో యువకులు ఆకర్షనియమైన అద్భుతాన్ని చూసి తరించారు వారు మాట్లాడుతూ ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం సూర్యుడు బుదుడు భూమి ఒకే వరుసలో వచ్చినపుడు ఈ ఖగోళ అద్బుతం సంబవిస్తుంది  ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని  విక్షించామన్నారు ఈ అద్భుత దృశ్యం  ఆకాశములో మళ్ళి చూడాలి అంటే 2032 నవంబర్ 13 న చూడవచ్చు అని అన్నారు.  ఈ అద్భుతం సూర్యుడి పైన నల్లటి వలయ ఆకారపు మచ్చల కనిపించిది దీనిని నేరుగా చూడవద్దని వెల్డింగ్ గ్యాస్  అద్డం సహాయంతో విక్షించామన్నారు ఈ సందర్శన లో గౌడ  సంఘం జిల్లా కోశా అధ్యక్షుడు కొయ్యడ రాజగౌడ్ ,ఎస్ వి ఇంగ్లీష్ మీడియం కరస్పడేండ్ దికొండ సంజీవ్ కుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు కుమారస్వామి, ముడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్, కె సునీల్ కుమార్, రాజేష్,గంగాధర్  తదితరులు చూశారు.

No comments:

Post a Comment