Sunday, 15 May 2016

బిసి లకు కళ్యాణ లక్ష్మిపథకం వర్తింపు సంతోషకరం

బిసి లకు కళ్యాణ లక్ష్మిపథకం వర్తింపు సంతోషకరం 

  (రెబ్బెన వుదయం ప్రతినిధి); పేద యువతుల పెళ్ళి కోసం ఎస్సీ, ఎస్టీ బాలికలకు అందించే కళ్యాణ లక్ష్మిపథకంను వీరితో పాటు బిసి బాలికలకు కూడా  పథకం అందించడంఎంతో సంతోషకరమని  తెరాస తూర్పు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు బీసి సంఘ జిల్లా మహిళా ఉప అద్యక్షురాలు కుందారపు శంకరమ్మ అన్నారు. శనివారం రెబ్బెన అధితి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి బిసి లకు కూడా  అందించడం ద్వారా పేద బాలికలకు ఎంతో చేయుతనించిన తెలంగాణా ప్రభుత్వ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుకి బిసి కుల సంఘం తరుపు నుంచి ప్రత్కేక ఆభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో నంబాల వార్డ్ సభ్యురాలు తీపుల సువర్ణ, పిల్లి లత, కోయడ సంధ్య, మిట్ల స్వరూప లు ఉన్నారు.

No comments:

Post a Comment