(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ పరిదిలో మగళవారం రోషన్ అలి ( 55 ) వెళ్తున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడి మృతిచెందాడు. స్తానికులు ,కుటిం భికులు తెలిపిన వివరాల ప్రకారం భాద్రచాలంరోడ్డు నుండి సిర్పూర్ టౌన్ వెళ్ళే సింగరేణి రైలు ఎక్కుతూ జారిపడి మరణించిన రోషన్ అలి మంచిర్యాల్ నివాసి ఆయనకు ముగ్గురు అమ్మయిలు ,ముగ్గురు అబ్బాయిలు మరియు భార్య ఉన్నారు. రోషన్ అలీ కుటుంభాన్ని పోషించుటకు ప్రతిరోజు రైలులో చిరువ్యపారం చేసుకుంటు జీవనం సాగించేవాడని ఇంకా మూడు రోజ్జులో కూతురు పెళ్లి ఉందని కుటిం భికులుతెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సంఘ టన స్థలానికి హుటాహుటిన చేరిన పెద్ద అల్లుడు అలీ ,మేనల్లుడు వాలబ్ అలీ బోరున రోదించారు.
No comments:
Post a Comment