టి అర్ ఎస్ లో కి చేరిన తెలుగు తమ్ముళ్ళు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని తెలుగుదేశం పార్టికి చెందినా నాయకులు ఏకతాటిపైకి వచ్చి టి అర్ ఎస్ లో చేరారు ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, అసిపాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి లు తెలుగుతమ్ముళ్ళకు టి అర్ ఎస్ కండువాలు కప్పి ఆహానిచారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని టి అర్ ఎస్ పార్టి చేపట్టిన అభివృద్ధి పనులు , సంక్షేమ పతకాలకు ఆకర్షితులమై టి ఆర్ ఎస్ పార్టి లో చేరినట్లు తెలిపారు . మండలాన్నిఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి అండదండలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్షమని ఆనయ అన్నారు . మోడెమ్ సుదర్శన్ గౌడ్ తో పాటు మండలము లోని తెలుగు దేశం పార్టి కార్య కర్తలు అందరు చేరారు.ఈ కార్యక్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబురావు ఎం పి పి సంజీవ్ కుమార్, తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జేశ్వల్, చెన్న సోమషేకర్, పోటు శ్రీధర్ రెడ్డి, తదితర నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment