Tuesday, 17 May 2016

ఇసుక మాఫియా ను అరికట్టాలని సబ్ కలెక్టర్ కు వినతి

ఇసుక మాఫియా ను అరికట్టాలని సబ్ కలెక్టర్ కు  వినతి

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని ఇసుక మాఫియాను అరికట్టాలని, అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను  అమ్ముకుంటు ప్రభుత్వా ఆదాయానికి గండికోడుతున్నారని, దీనితో ప్రభుత్వానికి  కోట్లాది రూపాయల ఆదాయం  గండిపడుతుందని సోమవారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం లో సబ్ కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ కు ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్లు వినతి పత్రంను అందచేసారు.  అనంతరం వారు మాట్లాడుతూ  గోలేటి  క్రాసు రోడ్డు వద్ద నిర్మిస్తున్న సింగరేణి సంస్ధ  అద్వర్యంలో  కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ [సి.ఎస్ .పి]  నంబాలవాగు  నుంచి గత కొన్ని సం,, ల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముకుంటు ప్రభుత్వా ఆదాయానికి గండికోడుతున్నారని అన్నారు.  ఈ నెల 10వ తేదిన అక్రముగా తరలిస్తున్నకంట్రాక్టర్ శంకరయ్య ట్రాక్టర్, జె సి బి లను పట్టుకొని , సి పి ఐ నాయకులు రెవెన్యు అధికారులకు అప్పజెప్పిన ఇంతవరకు  కంట్రాక్టర్ శంకరయ్య పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నా కేవలం జరిమానాతో  సరిపెట్టడం సరికాదని,ఇసుక మాఫియా  అక్రమ రవాణా మండలంలో ఆగాలంటే బాధ్యులపై  వాల్టా చట్టం, క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ  డిమాండ్ చేసారు.

No comments:

Post a Comment