Thursday, 12 May 2016

కంట్రాక్టర్ల పైన చర్యల తీసుకోవాలి --పలువురు నాయకులు

కంట్రాక్టర్ల  పైన చర్యల తీసుకోవాలి --పలువురు నాయకులు

(రెబ్బెన వుదయం ప్రతినిధి);   భూగర్బ జలాలు అడుగంటి పోయి ప్రజలు త్రాగు నీరు కోసం  తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇసుక అక్రమంగా రవాణా చేయడం సరికాదని రాష్ట్ర బి జె పి కాన్సిల్ సబ్యులు కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు  రెబ్బెన పరిదిలో  పులికుంట గుండాల   వాగు  నుంచి మంగళవారం రాత్రి అక్రముగా తరలిస్తున్న ట్రాక్టర్, జె సి బి ని, బి జె పి నాయకులు రెవెన్యు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అధినంలోకి తీసుకున్నారు గత కొంత కాలముగా కోట్లాది రూపాయల   అక్రము ఇసుక  తరలిస్తూన్నారని రెబ్బెన తహసిల్దార్కు వినతి అంద చేసి మాట్లాడారు సి ఎచ్ పి కంట్రాక్టర్ శనకరయ్య ను జె సి బి,  ట్రాక్టర్ యజమానులపై వాల్ట చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఇసుక రవాణాను అరికట్టలన్నారు కోట్లాది రూపాయల విలువ గల  ఇసుకను అక్రమంగా తరలించిన వారిపై విచారణ జరిపి  రికవరీ చేయాలని అన్నారు . తెలంగాణ ప్రభుత్వం  భూగర్బ జలాల కోసం  బరిఎత్తున ఏర్పాటు చేసిన  ఇంకుడు గుంతలు పనులు ఒకపక్కన జరుగు తుండగా మరోపక్క మండలంలో ఇసుక మాఫియ అక్రమ ఇసుకను పక్క మండలంలకు రాత్రిపగలు విచ్చల విడిగా రవాణాలు జరుగుతున్నాయి అని ఇంకుడు గుంతలు ఎన్ని చేసిన లాభమా లేదు అని ఉన్నంత అధికారులు తక్షణం స్పందించి ఇసుక రవాణాను డిమాండ్ చేసారు ఈ సందర్బముగా ఎ ఐ వై  ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు  బోగే ఉపేందర్,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్,బి జె పి   జిల్లా నాయకులు యలమంచి సునీల్ కుమార్ ,ఏ ఐ ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పుదరి సాయి ,బి జె పి నియోజక వర్గ కన్వినర్ జె బి ఫాడేల్  మరియు తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment