4వ రోజుకు చేరిన ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవదిక సమ్మె
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు . శుక్రవారనికి 4వ రోజుకు చేరింది ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు క్షేత్ర సహాయకుల సంఘo పిలుపు మ్మేరకు నిరవదిక సమ్మె చేపట్టారు. వీరికి ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మండల అద్యక్షుడు పుదరి సాయి కిరణ్ మద్దతు తెలిపారు అనంతరం సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా విదులు నిర్వహిస్తున్నామని చాలి చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామని అని అన్నారు కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు ఫీల్డ్ అసిస్టంట్ లకు మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అన్నారు ప్రభుత్వం సమస్యలను పరిశీలించడం లో విఫలం అయింది అని తేలిపారు రేగ్యులర్ చేయాలనీ అన్నారు ఫీల్డ్ అసిస్టంట్లకు 491 జి ఓ ప్రకారం ప్రతి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు ఉద్యోగులకు అర్హులను బట్టి ఇక్రిమెంటులు ఇవ్వాలని అన్నారు ఈ నిరవదిక సమ్మె ఫీల్డ్ అసిస్టంట్ లు జి . కె.తిరుపతి ఎ . తుకారం ఎ . ఫైకయ్య మొగిలి, తుకారం, స్వప్న, డి గణపతి ,దేవానంద్ జి . తిరుపతి ,ఎమ్ . వెంకటేశం ఉన్నారు
No comments:
Post a Comment