వి అర్ వో లు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలి.
(రెబ్బెన వుదయం ప్రతినిధి); వి అర్ వో లు తమ తమ గ్రామాలలో ఉండి సేవలు అందించాలని రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు తహసిల్దార్ వి అర్ వో లకు జరిగిన సమావేశంలో సోమవారం అయిన మాట్లాడారు. ఖరిప్ సీజన్ రాబోతున్నదని రైతులకు రుణం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంట చూడాలని అన్నారు. కస్తు దారులను మరియు పట్టా దారులను ప్రత్యేకంగా సర్వే చేసి లేని వారి పేర్లు తొలగించి ఉన్న వారి పేర్లను వెక్కియాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు సమాచారం తో రేషన్ కార్డ్ లు తీసుకొన్నారని వారిని ప్రతేకంగా సర్వే చేసి వెంటనే ఇవ్వలన్నారు. 2014 కంటే ముందు ఉన్న ఖస్తులో ఉన్నట్లు అయితే భూమి పత్రాలు చుపెటినట్లు అయితే లేని వారి పేర్లు తీసేసి కస్తు చేసే వారి పేరు ఎక్కించాలని అన్నారు ముందు వచ్చేది వర్షాకాలం కాబట్టి నిటి లోతట్టు ప్రాంతాలను ముందుగానే పరిశిలించి తుంగేడ, మదవాయిగూడ గ్రామంలోని దాదాపు 30 కుటుంబాలను పునరావాస గ్రామంలోకి మార్చాలని వెంటనే విచారణ జరపాలన్నారు. రైతులకు ఏ అవసరం వచ్చిన వెంటనే వి అర్ ఓ లు సకాలంలో పనులు పూర్తి చేయాలనీ అన్నారు ఈసమావేశంలో అర్ ఐ అశోక్ చవాన్, వి అర్ ఓ ధోనిబాపు, మల్లేష్, ఉమ్లాల్, నామదేవ్, వాసుదేవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment