Wednesday, 28 February 2018

మేరు కులస్తులకు ప్రభుత్వం తరపున రాయితీలు ప్రకటించాలి

   కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; మేరు  కులస్తులకు సబ్సిడీ పై కుట్టు మిషన్లు అందించాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు ప్రతి మేరుకు ఐదు ఎకరాల భూమి, ప్రభుత్వం తరపున రాయితీలను ప్రకటించాలిని రెబ్బెన మండల మెరు సంఘం అధ్యక్షులు బొమ్మినేని శ్రీధర్ మేరు, ప్రధానకార్యదర్శి రాయిలా నర్సయ్యలు అన్నారు. బుధవారం కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో టైలర్స్ డే సందర్భంగా మేరు  కులస్తులు  కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడీ మేడ్ వస్త్రాల తాకిడికి మేరు   కులస్తుల కులవృత్తి చాల దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా మేరు   కులస్తుల సమస్యలపై ద్రుష్టి సారించి ఆదుకోవాలని అన్నారు. మేరు  కులస్తులకు సబ్సిడీ పై కుట్టు మిషన్లు అందించాలని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రతి మేరుకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. రెబ్బెనలో మేరు   సంఘ భవనానికి పది హేను గుంటల     భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో , మేరు   సంఘం సభ్యులు బొమ్మినేని మల్లయ్య, కీర్తి మోహన్, రాపర్తి  అశోక్, గాంధే రామకృష్ణ, ఆత్మకూరు నరేష్, గాంధే ప్రభాకర్, సాగర్ మారిశెట్టి, గాంధే సుధాకర్, కీర్తి రాము,తెరాస జిల్లా నాయకులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్, తెరాస యువ నాయకులూ వినోద్ జైస్వాల్, మోడెమ్ రాజా గౌడ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. 

బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 93 శాతం సాధించిన బెల్లంపల్లి ఏరియా



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ;  బెల్లంపల్లి ఏరియా కు నిర్దేశించిన లక్ష్యాలను  అధిగమించడం కోసం అన్ని చర్యలను  చేపట్టడం జరిగిందని ,  ఫిబ్రవరి నెలలో 93 శాతం  బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని బెల్లంపల్లి ఏరియా జియం రవి శెంకర్ అన్నారు.  గోలేటి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు.   వార్షిక ఉత్పత్తి పరంగా చూస్తే  102 శాతం అధిగమించడం జరిగిందని  . బెల్లంపల్లి ఎరియా కు నిర్దేశించిన లక్ష్యాలను   అధిగమించడం కోసం సింగరేణి అధికార మరియ కార్మిక బృందం కృషి చేయాలనీ సూచించారు .అలాగే బెల్లంపల్లి ఏరియా 650 కోట్ల లాభాలతో ముందంజలో   ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి తో పటు రవాణా లో కూడా రికార్డు స్థాయిలో ఉందన్నారు సింగరేణి 11 ఏరియా లతో కలిపి ఈ సంవస్సరానికి  11 వందల కోట్ల రూపాయల ఆదాయం అర్జించడం జరుగుతుందని  సింగరేణి సిఎండి పేర్కొన్నట్లు తెలిపారు బెల్లంపల్లి ఏరియా లోని డోర్లి 1 జీవిత కాలాన్ని పొడిగించడం కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు 92 కోట్ల వ్యయంతో చేపట్టిన సిఎస్పి నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగినదని  గోలేటి నుండి గోలేటి ఎక్స రోడ్ వరకు రోడ్ వెడల్పు కొరకు టెండర్లను కూడా పూర్తయినట్లు తెలిపారు. ఈ వేసవి కాలం లో దరఖాస్తు చేసుకునే ప్రతీ కార్మికుడికి ఏ సి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం  శ్రీనివాస్ , డిజియం పర్సనల్ జె  కిరణ్ కుమార్ ,డి వై పి యం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

జతీయ సైన్స్ దినోత్సవం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; జతీయ సైన్స్ దినోత్సవం సందర్హంగా కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో సైన్స్ డే ను నిర్వహించినట్లు పాఠశాలా ప్రధానోపాధ్యాయులు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గాలి పీడనం, గుడ్డు సాంద్రత, మొదలైన పలు అంశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగినది,విద్యార్థులందరు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కారక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు  జాడి అశోక్ ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.  

ఆదివాసీలకు నిరాశ మిగిల్చిన ముఖ్యమంత్రి పర్యటన

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల  పర్యటన   ఆదివాసులను నిరాశపరిచిందని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  తొడసం భీంరావు, రాష్ట్ర  ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ లు అన్నారు.  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా విస్తృత స్థాయి  సమావేశం కొమురంభీం  జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో  బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ  ఉమ్మడి జిల్లాలోని ఆదివాసిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి పర్యటనతోనైనా పరిష్కారమవుతాయని ఆదివాసీలు ఆశించారు కానీ ఆదివాసీల సమస్యలపై ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో స్పందించలేదన్నారు. అన్నారు.ముఖ్యంగా  ఆదివాసీల పోడు   భూములకు పట్టాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న పట్టా పెట్టుబడి గురించి ప్రకటిస్తార ని ప్రజలు ఆశించారు.  నకిలీ  ఏజెన్సీ సర్టిఫికేషన్, నకిలీ  కుల ధ్రువీకరణ పత్రాలపై ఏజెన్సీలలో  వలసల   విషయంలో కెసిఆర్ ప్రకటించవసిందన్నారు.  రానున్న ఎన్నికలను  దృష్టిలో ఉంచుకునే సాగులో ఉన్న ప్రతి ఎకరాకు అందించాల్సిన కౌలు మరియు పోడు   పంట పెట్టుబడి సహాయం అందించాలని,  ఆదివాసీ గ్రామాలకు షెడ్యూల్ ఏజెన్సీలో కలపాలని ఏజెన్సీ పనుల విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలనిఅన్నారు  పై   సమస్యలన్నీ పరిష్కరించి   ఆదివాసులను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కొమురంభీం జిల్లాలోనే ఐటిడిఏను ఏర్పాటు చేసి ఐఎఎస్ అధికారిని  నియమించాలన్నారు ఈ సమావేశంలో టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి సైతం రాజు ఉపాధ్యక్షులు రైతులు ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ జిల్లా సహాధ్యక్షులు కొడప రాజేష్ వేలాది జ్యోతిరావు ఎర్రయ్య లచ్చయ్య చందు పోషక ఫ్రీడమ్ గంగారాం బంగారంతో తరులు పాల్గొన్నారు.

కందుల కొనుగోలు కేంద్రాల మూసివేత

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; జిల్లాలోని నాలుగు కేంద్రాలలో కందులు కొనుగోలు గురువారం  తో ముగియనున్నందున రైతులు దీనిని గమనించగలరని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్  పాటిల్  ఒక ప్రకటనలో  తెలిపారు .కో ఆపరేటర్ మార్కెటింగ్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం గురువారం  వరకు మాత్రమే కందులు కొనుగోలు చేయాలని అన్నారు కందులు కొనుగోలు కేంద్రాలైన ఆసిఫాబాద్,  జైనూర్, కాగజ్ నగర్ , సిర్పూర్ యు లో రేపటి నుంచి కందులు కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందన్నారు రైతులందరూ దీనిని గమనించి కందులను కొనుగోలు  కేంద్రాలకు తీసుకు వెళ్ళవద్దని  తెలిపారు.

ఓ డి ఎఫ్ పనులను పరిశిలించిన జిల్లా పాలనాధికారి

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; గ్రామంలోని ప్రజలందరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని   జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్  పాటిల్ అన్నారు.  బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా   రెబ్బెన మండలంలోని ఖైర్గం  మరియు నవేగం  గ్రామాల్లో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాల పనితీరులను  పరిశీలించారు. అనంతరం   గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు ఖైర్గం లో  మూడు వందల మరుగుదొడ్ల నిర్మాణ పనులు నవేగం లో  రెండొందల మరుగుదొడ్లు నిర్మాణాల పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి సిమెంట్ అందరికీ అందుతుందని ఎవరూ  వెనకడుగు వేయరాదని అన్నారు జిల్లాను మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ  ఫై డి వెంకట్, రెబ్బెన ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ అజ్మిరా  బాబు రావు, గ్రామా సర్పంచులు, సులోచన కమలాబాయి, మ్పదోసత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 27 February 2018

రసాయనం వద్దు సేంద్రియ రంగులు ముద్దు.

 
 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  హోలీ పండుగ నాడు ప్రజలు రసాయనాలతో తాయారు చేసిన రంగులు కాకుండా సేంద్రియ రంగులనే వాడాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షులు కాండ్రే విశాల్ అన్నారు . మంగళవారం స్థానిక బిజెవైఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో  మాట్లాడారు.  హిందూ ధర్మ సంస్కృతి ప్రకారం హోలికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు చిన్ని కృష్ణుడు బృందావనం లో బాల్యం లో చేసిన కార్యక్రమాలని పురస్కరించుకొని ఈ పర్వదినాన్ని రంగులతో పెద్ద చిన్న తేడా లేకుండా మనషుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చి ఒకరికి ఒకరు రంగులు పూసుకొని హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. కావున ప్రజలంతా రసాయనాలతో తాయారు చేసిన రంగులు కాకుండా సేంద్రియ రంగులనే వాడాలని తెలిపారు. ఈ సందర్బంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో కాండ్రే నిర్మల,మేకర్తి గోపాల్ ,గడ్డల మల్లన్న,మేకర్తి ముత్తయ్య ,సుందర్ సింగ్ నాయక్ ,కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

పర్సనంబాల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  అసిఫాబాద్ మండలంలోని పర్స నంబాల ప్రాథమికోన్నత  పాఠశాల ను జిల్లా విద్యాధికారి ఎం ఏ రఫీక్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.అన్ని తరగతుల విద్యార్థులను విద్యా ప్రమాణాల స్థాయిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారంలో నాటిన  మొక్కలు సంరక్షిస్తున్న విషయంలో, మరియు విద్యా ప్రమాణాల విషయంలో పాఠశాల సిబ్బంది కృషిని మెచ్చుకున్నారు. సెలవులో ఉన్న ఉపాధ్యాయుల సెలవు పత్రాన్ని, అందరి పాఠ్య ప్రణాళికల పుస్తకాల గురించి ఆరా తీశారు. సందర్శన సమయంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు హేమంత్ షిండే, ఉపాధ్యాయులు దేవాజి, రజిత,కుమార్ లు హాజరై ఉన్నారు. జిల్లా విద్యాధికారి తో పాటు నోడల్ అధికారి ఎం ఏ జబ్బార్ పాల్గొన్నారు .

త్రాగు నీటి సౌకర్యం కలిపించాలి


  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  గోలేటిలోని గౌతమ్ నగర్ లో మంచినీటి మరియూ సి సి రోడ్  సౌకర్యం  కల్పించాలని, సి పి ఐ  నాయకులు ,కాలనీ వాసులు గ్రామ పంచాయతీ సెక్రెటరీకి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా సీపీఐ నాయకుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ కాలనీ లో ఒక సంవస్సర కాలం నుండి  మంచినీటి సౌకర్యం లేక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.అధికారులు పైప్ లైన్ వేసి నల్ల     కనేక్షన్ ఇవ్వకపోవడం తో త్రాగునీరు అందడం లేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు గౌతంనగర్ కాలనీ కి త్రాగు నీరు మరియూ సి సి రోడ్ సౌకర్యం   కలిపించాలని కోరారు అలాగే కాలనీ వాసులు మాట్లాడుతూ. ప్రతి రోజు త్రాగు నీటి కోసంకిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తుందని త్రాగు నీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నాం అని మా బాధల్ని ఇప్పటికైనా అధికారులు గుర్తించి మా గౌతమ్ నగర్ కాలనీ కి నీటి సౌకర్యం కలిపించాలని వారు  కోరారు

శ్రీరాంపూర్ సభకు తరలివెళ్లిన నేతలు మరయూ కార్మికులు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  తెరాస బహిరంగ సభకు గోలేటి నుండి తరలివెళ్లిన తెరాస నాయకులూ మరియూ కార్యకర్తలు  ఈ  సందర్బంగా పన్నెండు  బస్సులల్లో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీర్ మొదటి సారిగా సీఎం హోదాలో  సింగరేణి ప్రాంతానికి వస్తుండటం తో కార్మికులకు ఇచ్చిన హామీలు ఈ  రోజు నెరవేరుతాయని సింగరేణి కార్మికులు ఎంతో ఉత్కంఠతో ఈ యొక్క సభకు హాజరవుతున్నటు సమాచారం . కార్మికులు  నల్లగొండ సదాశివ్  M.శ్రీనివాస్ రావ్, ప్రకాశ్ రావ్. రాంబాబు. అబ్బు శ్రీనివాస్ రెడ్డి. ఎం.చర్లిస్. కుమారస్వామి .  రాములు, శేఖర్. అధికారులు,శ్రీనివాస్ ఎస్ ఓటు జెనరల్ మేనేజర్ .జూపక కిరణ్ కుమార్,డి వై పి యం లు  రాజేశ్వర్ , రామ శాస్త్రి. సుదర్శన్.  ఐ ఈ డి యోహాన్  కిరణ్ కుమార్ , తదితరులు వెళ్లారు.

Monday, 26 February 2018

ఎన్నికలముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 26 ; ఎన్నికలముందు ఇచ్చిన  హామీలు నెరవేర్చాలని  బీజేపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయూలు గౌడ్ అన్నారు. సోమవారం తిర్యాణిలో ఏర్పాటుచేసిన  సమావేశంలో మాట్లాడారు. తెరాస  ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఇచ్చిన  హామీల అమలుకై వచ్చే నెల ఐదు ఆరు తేదీల్లో తహశీల్ధార్ కార్యాలయం ముందు, పన్నెండవ తేదీన జిల్లా కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున  ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ,గిరిజనులకు మూడెకరాల భూమి, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇంటికో ఉద్యోగం చొప్పున లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి  వచ్చి  నాలుగేండ్లయినా వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం   చేస్తున్నదన్నారు. ఈ   విలేకరుల సమావేశంలో బిజెపి ఆదిలాబాద్ పార్లమెంటు కన్వీనర్ అజుమేర రాము నాయక్ మాట్లాడుతూ  ఈ కార్యక్రమాలలో  ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు  ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు మడావి సీతరాం, ప్రదాన కార్యదర్శి పులి వేంకటేష్, నాయకులు అమిరిశేట్టి రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పార్టీ బలోపేతానికి కృషిచేయాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 26 ; బీజేపీ పార్టీని జిల్లాలో బలోపేతంచేయడానికి, పార్టీ భవిషత్ ప్రణాళిక  రూపకల్పనకు సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయూలు గౌడ్ అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి లోని బుధవారం బీజేపీ కార్యాలయంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై చేర్చించనున్నామన్నారు. ఈ  సమావేశానికి ముఖ్య అతిధి గ జిల్లా ఇంచార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారన్నారు. జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్ మరియ జిల్లా పదాధికారుల మోర్చాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు హాజరవుతున్నారని అన్నారు.  

Saturday, 24 February 2018

తీవ్ర అలసటతో ఊపిరాడక చుక్కల దుప్పి మృతి

 
 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; చుక్కల దుప్పి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోవడం జరిగిందని జోడేఘాట్ రేంజ్ అటవీ అధికారి మహేందర్ తెలిపారు.  కొమురంభీం జిల్లా  జోడేఘాట్ మండలం ధనోరా గ్రామంలోకి శనివారం ఉదయం సమయంలో  సమీప అడవినుంచి ఓ మెగ చుక్కల దుప్పి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోవడం జరిగిందని, పశువైద్యాధికారి విశ్వజిత్ దుప్పిని  పరిశీలించి చాల ఎక్కువ దూరం పరిగెట్టడం వలన అలసటతో  ఊపిరాడక మరణించినట్లు ధృవీకరించారు. జోడేఘాట్ ఫారెస్ట్  ఆఫీసర్  మహేందర్ పై అధికారులకు సమాచారమిచ్చి  పై అధికారుల సూచనపై గ్రామస్తుల సహకారంతో దుప్పిని దహనం చేయటం జరిగిందని తెలిపారు. 

పక్కదారి పడుతున్న వికలాంగుల స్వయం ఉపాధి పథకం సొమ్ము

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; వికలాంగుల అభివృద్ధికి మంజూరైన నిధులు పక్కదారి పడుతున్నాయని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆసిఫాబాద్ కమిటీ గౌరవ అధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్ ఆరోపించారు, శనివారం ఆసిఫాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ  కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా  ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా  వికలాంగులకు ఇప్పటివరకు ఎలాంటి రుణం ల్యాబ్ ద్వారా అందలేదాని .   వికలాంగులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామంటున్నారు  కానీ ఇప్పటి వరకు ఏమీ  వికలాంగులకు  చేరడం లేదు.   మూడు సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయలు వికలాంగుల  స్వయం ఉపాధి కోసం వచ్చిన డబ్బులు వికలాంగులకు చేరక పోగా  వాటిని డీఆర్డీవో ఆఫీస్ నిర్వహణ కోసం  వారి  అకౌంట్లో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నారు దానితో వచ్చే డబ్బుతో ఆఫీస్ నిర్వహణ కోసం వాడుతున్నారు.   దీనిపై వెంటనే పై అధికారులకు విచారణ చేపట్టి వికలాంగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరరు. ఈ కార్యక్రమంలోకుదురుపాక మల్లేష్ బూర శ్రీనివాస్ జాడ పాలక రావు కె రాజయ్ తదితరులున్నారు.

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంరద్దుకై వినతి

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ;    పిపిఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆసిఫానాద్  లో ఎమ్మెల్యే కోవలక్ష్మి కు వినతిపత్రం  సమర్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిఎస్ రద్దు విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు  ఈ సందర్భంగా టిఎస్యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆగాచారి డిటిపి జిల్లా అధ్యక్షులు మడావి రమేష్ టీఎస్ సీఎస్ టిటియు జిల్లా అధ్యక్షులు మేడి చందాదాసులు  మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం వలన సుమారు ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు ఈ  కార్యక్రమంలో డిటిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఎం రాజా కమలాకర్రెడ్డి టిఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి పూర్ణ సిపిఎస్ టిఇయు జిల్లా కో ఆర్డినేటర్ సూర్యనార్ కార్ చైతన్య కుమార్ నాయకులు ఆత్రం పితాంబర్ మాల్ షిండే తంగడపల్లి రమేష్ దుర్గం శ్రీనివాస్ నవీన్ తదితరులున్నారు.

జాతి సంపదలను ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం

 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; కేంద్రం లో భాజపా ప్రభుత్వం స్వదేశీ జాతీయ దేశభక్తి పేరుతో దేశం లోని బొగ్గు గనులను బహుళ జాతి సంస్థలకు అప్పగించేందుకు కుట్రపన్నుతున్న దని. భారత కార్మిక సంఘాల సమాఖ్య తరుపున అడ్డుకుంటామని  జి ఎల్ బి కే ఎస్ నాయకుడు మైసూర్ సింగ్  అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్స్  రెబ్బెన మండలం గోలేటి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మైసూర్ సింగ్ మాట్లాడుతూ కోలిండియాలో 214 బ్లాకులను  ప్రయివేటీకరించుటకు బీజేపీ ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా బొగ్గు బ్లాకులు   కార్పొరేటు సంస్థల చేతికి పోవడం జరుగుతుందని,  ఈ విధంగ జాతియ సంపద   ప్రయివేటు సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంపదలను విదేశీ సంస్థలకు  అమ్మి ఒక లక్ష కోట్లను బడ్జెట్ సమావేశాలకు సమకూర్చుకోవాలని నిర్ణయించింది అని తెలిపారు ఇప్పటికే సింగరేణి గనులను తెరాస ప్రభుత్వం  ప్రయివేటీకరించినది ఈ ప్రయివేటు విధానాలకు వ్యితిరేకంగా కార్మికవర్గం పెద్దఎత్తున  పోరాడాలని తెలిపారు ఈ సమావేశం లో జిల్లా నాయకులూ  ,తిరుపతి ,సురేంధేర్ తదితరులు  పాల్గొన్నారు 

ఆశ్రమ పాఠశాలలో పరీక్ష సామగ్రి పంపిణీ

 ఆశ్రమ పాఠశాలలో పరీక్ష సామగ్రి పంపిణీ

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; పేద విద్యార్థులకు బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ అద్వర్యం లో శనివారం రెబ్బెన మండలం గోలేటి లోని ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి (ప్యాడ్స్ ,పెన్స్) ని అందించారు. అధ్యక్షులు ఒరగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణగా ఉండి  శ్రద్దగా చదువుకొని విద్యార్థులకు, వారి పాఠశాలకు , తల్లి తండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని పట్టుదలతో చదవాలని ఈ సం,, 100% ఉత్తిర్ణత సాధించాలని చెడు వ్యసనాలకు దూరంగ ఉండి సన్మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు కూడా సేవా భావం కలిగి ఉండాలని కోరారు. నిరుపేద విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతాం అని అన్నారు. అనంతరం ప్రదనోపాధ్యాయులు బెటర్ యూత్  సేవా సంస్థ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో  సంస్థ గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి ఉపాధ్యక్షులు రాజశేఖర్ సెక్రెటరీ అజయ్,రవీందర్ కార్యదర్శులు ఏగ్గే తిరుపతి, బలుగురి తిరుపతి, విజయ్, రాజేష్ మరియు పాఠశాల  ప్రధానోపాధ్యయూడు  సోమయ్య , వార్డెన్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; ప్రాధమిక వ్యవసాయ   సహకార సంఘం లి. రెబ్బెన  నందు వాటాదనం కలిగిన రైతులు త్వరలో సొసైటీఎన్నికలు ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకోవడానికి  తమకు  సంబందించిన  ధ్రువపత్రాలను సంఘం కార్యాలయం  నందు  మార్చ్ మూడవ తారీఖు  లోపు అందజేయాలని  సీ  ఈ ఓ ఆర్ సంతోష్   ఒక ప్రకటనలో తెలిపారు . సంఘం  లో రూ.300 వాటా దనం కలిగిన రైతులు  మరియు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకొనేవారు  తమ ఆధార్ కార్డు, ఫొటో,  మీ సేవ పహాని లేదా పట్టా పుస్తకం జిరాక్స్ లు  03-03-2018  తేదీ సాయంత్రంలోపు  సంఘ కార్యాలయం లో అందచేయాలన్నారు.  

Friday, 23 February 2018

పనులను సకాలంలో పూర్తిచేయాలి ; కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పనుల పురోగతిపై సమీక్ష సమావేశం



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 23 ;  జిల్లాలో  సి బి ఎఫ్ నిధులతో మంజూరైన పనులు ఇప్పటికి  తొంబై  శాతం పూర్తి అయ్యాయని, మార్చ్ ముఫై ఒకటి కల్లా మిగతా పది  శాతం పనులు నాణ్యతలో రాజీపడకుండా నిర్ణిత గడువులోగా పూర్తి  చెయ్యాలని అధికారులను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్   పాటిల్ ఆదేశించారు.  శుక్రవారం  ఎం పి , ఎం ఎల్ ఏ   సి బి ఎఫ్ నిధులతో మంజూరైన పనుల పురోగతిపై సమీక్షా  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తహసీల్దార్ లు, ఎంపీడీఓలు సమన్వయంతో    పనులు నాణ్యతలో రాజీపడకుండా నిర్ణిత గడువులోగా పూర్తి  చెయ్యాలని అధికారులను ఆదేశించారు.పనులు పూర్తిచేయకపోతే అధికారులపై కఠిన చేర్యలుంటాయన్నారు.పనిచేసి పనులు పూర్తి చేయాలన్నారు.   అసలు పనులు మొదలుపెట్టని వాటి రద్దుకు ప్రతిపాదనలు  పంపాలన్నారు. . ఈ పనులు పూర్తిచేస్తే మిగతా నాల్గవ విడత నిధులు మంజూరవుతాయన్నారు . అధికారులు పనుల పురోగతిపై  ప్రతివారం నివేదికలు పంపాలన్నారు.  ఈ సమీక్షాసమావేశంలో సీ  పి  ఓ ఆర్ క్రిష్నయ్య, ఎంపీడీఓలు, ఆర్ డబ్ల్యూ ఎస్  మరియు ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా మరియ వీడ్కోలు ఉత్సవం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 23 ; రెబ్బెన మండలంలోని ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో 2018  క్రీడా మరియ  వీడ్కోలు ఉత్సవం శుక్రవారం  నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు కళా ప్రదర్శనలతో అలరించారు.   కళాశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ   చదువును కస్టపడి  కాకుండా ఇష్టపడి  చదివితే మంచి ఫలితాలను సాదించగలుతార న్నారు . పరీక్షల సమయంలో మానసిక వత్తిడికి గురికాకుండా ప్రశాంత మనస్సుతో ఉండాలన్నారు. రెబ్బెన గ్రామ సర్పంచ్ పేసరి వెంకటమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్ధి పరీక్షలలో మంచి ప్రతిభ కనపర్చి   రెబ్బెన పట్టణ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు  ఈ సందర్బంగా  కళాశాల సిబ్బంది విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆ తర్వాత నిర్వహించిన నృత్యాలు చూపరులను ఎంతగానో అలరించాయి , ఈ కార్యక్రమంలో కళాశాల బోధనా సిబ్బంది,   తదితరులు పాల్గొన్నారు.  

Thursday, 22 February 2018

బెదిరించి యువతిపై అత్యాచారం ; నిందితుడి రిమాండ్



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 22 ;   కొమురంభీం జిల్లా రెబెనా మండలం నారాయణపూర్ గ్రామస్థుడు వేమునూరి పురుషోత్తం 24 సంవత్సరాలు  గత ఆరు నెలలనుండి అదే గ్రామానికి చెందిన యువతిని బెదిరించి అత్యాచారానికి  పాల్పడినందున  బాధిత యువతి తండ్రి ఆయిల్లా రమేష్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి  అరెస్ట్ చేసినట్లు   గురువారం రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తంచారి విలేకరుల సమావేశంలో తెలిపారు.  తల్లి, తండ్రి, సోదరుడు పనికి వెళ్లగా  సరిగా మాట్లాడలేని బాధితురాలు ఇంట్లో ఒంటరిగా  ఉండగా నిందితుడు  బాధితురాలి పై ఆత్యహరానికి గత ఆరునెలలుగా పాల్పడ్డాడని ప్రస్తుతం బాధితురాలు నాలుగు నెలల గర్భిణీ  అని తెలిపారు. నిందితుడిని రెబ్బెన పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకై ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి పంపినట్లు తెలిపారు. నేరస్తుడిని జుడిషియల్ రేమండ్ కు తరలించినట్లు తెలిపారు. 

హాల్ టికెట్స్ కై వేధిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 22 ; ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు  విద్యార్థుల అడ్మిషన్ సమయంలో స్కాలర్ షిప్  డబ్బులతో అడ్మిషన్ చేసుకుని తీరా హాల్ టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఐదువేల   రూపాయలు ఫీజు కట్టమని లేకుంటే హాల్ టిక్కెట్లు ఇవ్వమని వేధిస్తున్నట్లు జిల్లా ఏబీవీపీ  కన్వీనర్ ఎలాగతి  సుచిత్  ఆరోపించారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ   ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు  హాజరుకానున్న విద్యార్థులకు హాల్ టికెట్స్  ఇవ్వకుండా వేధిస్తున్న  ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు   విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని  లేనిచో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నారు.ఈ     సమావేశంలో తెలంగాణ ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోసరి మహేష్ వసతి గృహాల కన్వీనర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 21 February 2018

కోలిండియా అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటిన సింగరేణి జట్టు

కోలిండియా అథ్లెటిక్ పోటీల్లో సత్తా  చాటిన సింగరేణి జట్టు 
  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 21 ;   బెల్లంపల్లి  సింగరేణి కార్మిక జట్టు  పశ్చిమ బెంగాల్  లో జరుగుతున్నాకోలిండియా అథ్లెటిక్ పోటీల్లో రెండు రజత పథకాలు సాధించిందని ఎస్ సి సి ఎల్  జట్టు మేనేజర్ రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ ఈవెంట్ లో    నిర్వహించిన 400 హార్డెల్  మరియూ విలువిద్య పోటీల్లో  సింగరేణి కార్మిక జట్టు రెండు రజత పథకాలు సాధించిందని .ఈ పోటీల్లో పాల్గొన్న పి క్రాంతికుమార్ హార్డెల్ మరియ విలువిద్య లో టి రవీందర్ పథకాలు   సాధించారని తెలిపారు.  అథ్లెటిక్  పోటీల్లో  పథకాలు సాధించిన క్రీడాకారులకు బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్,డి జి యం పర్సనల్ జ్ కిరణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్ అభినందనలు తెలిపారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు సకాలంలో హాల్ టికెట్లు జారీచేయాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 21 ;   ఇంటర్మీడియటే మొదటి సంవత్సరం మరియూ ద్వితీయసంవత్సర పరీక్షలు  ఈ నెల 28వ  తేది నుండి ప్రారంభమవుతునందున ప్రయివేట్ విద్య సంస్థలు ఈ సమయం లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండ సకాలములో హాల్ టికెట్లను  అందజేయాలని ఏ  ఐ ఎస్ ఎఫ్  డివిజన్ కార్యదర్శి పుదారి సాయి కుమార్ అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ  కొన్ని ప్రయివేటు యాజమాన్య సంస్థలు ఫీజులు ఎక్కువగా  దండుకునేందుకు ఇదే అదునుగా భావించి దౌర్జన్యంగా విద్యార్థుల పై ఫీజుల పేరుతో ఒత్తిడి తెస్తూ వారిని  పరీక్షల సమయంలో మానసికంగా  ఇబ్బందులకు గురిచేస్తున్నారనిఅన్నారు , ఇలా ఇబ్బందులకు గురిచేయడం వల్ల  విద్యార్థులు ఒత్తిడికిగురై చదువుపై ద్రుష్టి పెట్టలేకపోతారన్నారు. విద్యార్థుల భవిషత్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులను మానసికంగా ఒత్తిడి కి గురిచేసే యాజమాన్యాల  పై అధికారులు  చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఈ  సమావేశం లో ఏ  ఐ ఎస్ ఎఫ్  జిల్లా నాయకులూ డి రవి, మండలనాయకులు బొమ్మినేని శ్రీకాంత్, నరేందర్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 20 February 2018

పరీక్షల సమయాలలో ప్రేత్యేక బస్సులు నడిపించాలి



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 20 ;   విద్యార్థులకు  పరీక్షల సమయాలలో ప్రేత్యేక   బస్సులు నడిపించాలని   ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కుంబిడి రాజేష్ ఆసిఫాబాద్ రోడ్ రవాణాసంస్థ  డిపో మేనేజర్ కు  వినతి పత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ  విద్యార్థులకు  పరీక్షలు  మొదలవుతున్నందున    స్పెషల్ బస్సులు నడిపించాలని అన్నారు.   ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ  జిల్లా సహాయ కార్యదర్శి  జునుగరి రమేష్,  షారుఖ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.  

దళితులకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 20 ;  దళితులకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలని సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్ కు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాండ్రే విశాల్  మంగళవారం వినతిపత్రం అందచేసారు. అనంతరం మాట్లాడుతూ ఆసిఫాబాద్  గొల్లగూడ గ్రామపంచాయతి పరిధిలోని  ఎస్ సి కాలనీలో పది కుటుంబాలు కూలి నాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని వారికీ ప్రభుత్వం ప్రకటించిన దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కింద సాగు భూమిని అందచేయాలన్నారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు వినతి పాటలు అందచేయడం జరిగిందన్నారు. తెరాస అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు నాలుగు సంవత్సరాల పరిపాలన  అనంతరం  హామీలుగానే మిగిలాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాధిక,జి. మల్లన్న, రాకేష్, ఎస్ సి కాలనీ వాసులు రాజన్న, నగేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయ మరమత్తుల వల్ల పంటలకు సాగు నీరు ; ఎంపిపి సంజీవ్ కుమార్

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 20 ;  మిషన్ కాకతీయ పనులలో  చెరువుల పునరుద్దరణ ,మరమత్తుల వల్ల సాగు భూములకు నీరు అంది రైతులకు  మేలు జరుగుతుందని  ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలం లో మంగళవారం నాల్గవ  విడత  మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతులకు సాగు నీరు అందించలానే ముఖ్య ఉద్దేశంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెబ్బెన ముచ్చెరువు   24 లక్షల తో మరియూ పులికుంట గ్రామ పోచమ్మ చెరువు 23 లక్షలతో పనులను ప్రారంభించారు.   ప్రజల సంక్షేమ ద్యేయంగా  పంట పొలాల అభివృదికై నీటి సమస్య లేకుండా చెయ్యడానికై సీఎం కేసీఆర్  మిషన్ కాకతీయ పనులు చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగా మన మండలం లోని ప్రతి గ్రామంలో కూడా మిషన్ కాకతీయ పనులను చేపట్టి పూడికతీత మరియూ నీటి సరఫరా నిమిత్తము కేనాల్స్ కూడా కట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజ్మిర  బాబు రావు  , సర్పంచ్ గజ్జెల సుశీల, తెరాస మండల అధ్యక్షులు  శ్రీధర్ రెడ్డి సింగల్ విండో డైరెక్టర్లు సత్యనారాయణ, పేసర్ మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

Monday, 19 February 2018

ఛత్రపతి శివాజీ జన్మదిన ఉత్సవాలు



 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 19 ;  రెబ్బెన మండలంలోని నక్కలగూడ,వంకులం ,లక్ష్మిపురం తదితర గ్రామాలలో సోమవారం రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జన్మదిన ఉత్సవాన్ని ఘనంగా  జరుపుకున్నారు.  నక్కలగూడ గ్రామంలో    పతాకావిష్కరణ  చేసి మిఠాయిలు పంచారు గ్రామ ప్రజలు,చౌదరి పల్కాజి, గ్రామ అధ్యక్షుడు,జాబారి రావుజీ ,చౌదరి హేమాజీ,పిప్రి బాలకిషన్ ,చౌదరి దుర్గాదాస్ ,చౌదరి పోశన్న ,చౌదరి శెంకర్ ,చౌదరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 జన్మదిన ఉత్సవాలు




 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 19 ; ఛత్రపతిశివాజీ   మహారాజ్ 391  జన్మదిన ఉత్సవాలు కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లాలో    సోమవారం ఘనంగా జరుపుకొన్నారు.జిల్లాకేంద్రమైన  ఆసిఫాబాద్ లో రాష్ట్ర ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు   అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎం ఎల్  సి  పురాణం సతీష్ , ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి , ఎం ఎల్ ఏ  కోనేరు కోనప్ప ల  సమక్షంలో   ఛత్రపతి   శివాజీ  విగ్రహాన్నిఆసిఫాబాద్ పార్లమెంట్ సభ్యులు  గెడం నగేష్  ఆవిష్కరించారు. ఆరె కులస్తులు భారీగా చేరుకుని శివాజీ విగ్రహానికి ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర శివాజీ చరిత్రను  ఈ తరమువారు చదివి స్ఫూర్తి పొందాలని అన్నారు. జిల్లా కేంద్రంలో   ఛత్రపతి శివాజీ నూతన భవన నిర్మాణానికి  ఎం పి   10 ,ఎం ఎల్ సి 20, ఎం ఎల్ ఏ  20  లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆరె  కులస్తులను ప్రభుత్వం  అన్ని విధాలా ఆదుకుంటుందని  అన్నారు.   అలాగే రెబ్బెన  రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి , గంగాపూర్ గేట్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించడానికి  ప్రయత్నాలు ముమ్మరం  చేస్తున్నామన్నారు. అంతకు ముందు శివాజీ జన్మదిన సందర్భంగా ఆరె  కులస్తులు  మరియు శివాజీ  అభిమానులు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులగుండా భారీ ఎత్తున ర్యాలీ   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ చైర్మన్ లోక భూమి రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్ నల్లలా ఓదెలు, ఎం ఎల్ సీ  కరీంనగర్ నారదాసు లక్ష్మణ్ రావు,  ఆసిఫాబాద్ జిల్లా పరిషత్   అధ్యక్షురాలు శోభా రాణి,  జిల్లా  శివాజీ సమాజ్  అధ్యక్షులు బుర్కుటే నాగయ్య,   తదితరులు పాల్గొన్నారు.     

Sunday, 18 February 2018

స్కాములన్నీ యూపీఏ హయాంలోనే ; జేపీ పౌడెల్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ;   యూపీఏ హయాంలోనే బ్యాంకుల స్కాంలు  జరిగాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు  జేపీ పౌడెల్   అన్నారు.  ఆదివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు.నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్ డి ఏ  ప్రభుత్వం ఎంతటి వారినైనా ఉపేక్షించదని అన్నారు.గత యూపీఏ ప్రభుత్వ హయములోనే బొగ్గు కుంభకోణం , టూ జి స్పెక్ట్రమ్ ,వంటి స్కామ్లు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రములో తెరాస ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన   వాగ్దానాలన్నీ నీటి మూటలైనాయని,అన్నారు.దళితులకు మూడు ఎకరాలభూమి  హామీని మర్చిపోయారన్నారు. లక్ష ఉద్యోగాల మాట మర్చిపోయి నిరుద్యోగు  లను మోసం చేశారన్నారు.      ఈ సమావేశంలో  జిల్లాప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, మురళి ధర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి   శ్రీనివాస్, సిర్పూర్ టి జడ్పీటీసీ అజమీర రామ్ నాయక్, జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్  గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాంద్రే విశాల్, బి సీ  మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి , కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 



ఈ పాస్ విధానంలో రేషన్ సరుకుల పంపిణి ; ఇబ్బందులున్నాయంటున్న డీలర్లు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ;   ఈ-పాస్ విధానంలో బయెమెట్రిక్ విధానం కీలకం. ఈ పాస్ యంత్రంలో వేలిముద్రల ద్వారా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం రేషన్ కార్డుదారులతోపాటు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అలాగే ఆధార్, ఫోన్ నెంబరు, కులం, ఇతర  వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఈ-పాస్ విధానం అమలు కోసం పౌరసరఫరాల శాఖ ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సర్వర్ ఆధారంగా చేసుకొని మొబైల్ నెట్‌వర్క్ సహాయంతో రేషన్ దుకాణాల్లోని ఈ-పాస్ యంత్రాలు పనిచేస్తాయి. ఈ మేరకు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 3జీ మొబైల్ నెట్‌వర్క్ సిమ్ కార్డులను రేషన్ డీలర్లకు అందజేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ సర్వర్‌కు అనుసంధానంగా ఉండే 3జీ సిమ్ ద్వారా బయోమెట్రిక్ (ఈ-పాస్) యంత్రం పనిచేస్తుంది. ఇక ఈ-పాస్ యంత్రాన్ని ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలకు అనుసంధానం చేశారు. దీంతో బయోమెట్రిక్ ఈ-పాస్ యంత్రంలో వినియోగదారుల వేలిముద్రలు తీసుకొని రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే కచ్చితమైన కొలతలతో నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్ కార్డుదారుడు, లేదా ఆ కుటుంబంలోని లబ్ధిదారుల వేలిముద్రలు ఉంటేనే సరుకుల  పంపిణి జరుగుతుంది. గతంలో వలే ఇతరులకు ఇకపై సరుకులను పంపిణీ చేయడానికి కుదరదు. మరోవైపు సరుకుల తూకం సరిగా వేస్తేనే ఈ-పాస్ యంత్రం నమోదు చేసుకుంటుంది. తద్వారా నిత్యావసరాలు సక్రమంగా, సరైన తూకంతో అందుతాయి. ఈ-పాస్ యంత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా నిత్యావసర సరుకులను పొందేందుకు వినియోగదారులకు సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రక్రియలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా  రేషన్ సరుకులను కొనే వీలుంటుంది. కొత్తగా ప్రెవేశ పెట్టిన ఈ పాస్  విధానం  వల్ల  సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతుందని అన్నారు. కొన్ని ప్రేదేశాలలో అంతర్జాల ఇబ్బందితో , వేలిముద్రలు సరిగా రాక సరుకుల పంపిణి  త్వరగా అవటం లేదన్నారు. ఒకటవ తారీఖు నుండి ఇరవై రెండు తేదీలలో పూర్తి పంపిణి జరగాలని ఆదేశాలున్న,ఇప్పటి వరకు కేవలం అరవై రెండు శాతమే పంపిణి చేయగలినట్లు కొంతమంది డీలర్లు తెలిపారు. 

Saturday, 17 February 2018

ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ;  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన  వేడుకలను కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో తెరాస పార్టీ నాయకులు శనివారం ఘనంగా జరుపుకున్నారు.     రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో   లో కేక్ కట్ చేసి , రోగులకు  పండ్లు పంపిణీ చేసారు.  ఈ సందర్బంగా ఎంపిపి సంజీవ్ కుమార్  మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి శాంతియుతంగా  తెలంగాణ రాష్టాన్ని సాధించి, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్న ధీశాలి కెసిఆర్  అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోపార్టీ మండల  అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, నాయకులూ   జకీర్ ఉస్మాని, వనజ, నవీన్ కుమార్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, చిరంజీవిగౌడ్, వినోద్, చంద్రయ్య, అశోక్,సురేష్ జైశ్వాల్, ఉబెదుల్లా  తదితరులు పాల్గొన్నారు. అలాగే గోలేటిలోని టి బి జి కే  యస్ తెలంగాణ భవన్ లో జరిగిన కెసిఆర్ జన్మదిన వేడుకలలో  కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణి చేసారు. ఈ సందర్బంగా టి బి జి కే  యస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదాశివ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశ జ్యోతి సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎం . శ్రీనివాసరావు సెంట్రల్ కార్యదర్శి,es . ప్రకాశరావు నాయకులు డి  మంగిలాల్, ఏరియా కార్యదర్శి పోటు శ్రీదర్రెడ్డి, మోర్ల నరేందర్, రాజుఎం .కుమారస్వామి, రాంబాబు, మస్కు రమేష్, జిల్లా కోర్దినేటర్ కొండు సత్తయ్య, అన్నం లస్మయ్య, బి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Friday, 16 February 2018

పదోన్నతులు పొందిన పోలీస్ ఉద్యోగులకు ఘన సన్మానం


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;  కొమురంభీం జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్  లో పనిచేస్తున్నడి రాజయ్య, సుభాష్ చంద్ర మండల్  పదోన్నతి పొందిన  సందర్భంగా రెబెనా సర్కిల్ ఇనస్పెక్టర్  పురుషోత్తం చారి , ఎస్సై శివకుమార్ లు   అభినందించారు.      హెడ్ కానిస్టేబుల్ రాజయ్యకు అసిస్టెంట్ సబ్  ఇనస్పెక్టర్  పదోన్నతి లభించింది.  కానిస్టేబుల్   సుభాష్ చంద్ర మండల్ కు హెడ్ కానిస్టేబుల్ గ పదోన్నతిపై    సిర్పూర్ (టి) పోలీస్టేషన్ కు  బదిలీ అయ్యింది. శుక్రవారం .సాయంత్రం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో  జరిగిన  సిబ్బంది అభినందన కార్యక్రమంలో సర్కిల్ ఇనస్పెక్టర్  పురుషోత్తం చారి, ఎస్సై శివకుమార్ లు మాట్లాడుతూ క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదోన్నతులు లభించడం సంతోషదాయకమన్నారు. పదోన్నతి పొందిన సిబ్బందికి శాలువా  కప్పి సన్మానించారు. .  ఇకముందు కూడా వీరు మరింత బాధ్యతతో పనిచేసి గుర్తింపు తెచుకోవా లన్నారు.  స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతులు పొందినవారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా   జైనూర్ లో పనిచేసిన నర్సయ్య బదిలీపై రెబ్బెన పోలీస్ స్టేషన్  అడిషనల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. 

రెసిడెన్సియల్ లో ఐదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;  తెలంగాణ గురుకుల కామన్ నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెసిడెన్సియల్ పాఠశాలలలో ఐదవ తరగతి ప్రవేశానికి  దరఖాస్తు చేసుకోవడానికి  అర్హులని పూర్తి వివరాలకు హెచ్టిటిపి సెట్ కాలేజ్ గౌట్ ఇన్ నుండి పొందగలరని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల జిల్లా సమన్వయ అధికారి యు గంగన్న  తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో గల విద్యావేత్త లు, సామాజిక సేవకులు, విద్యార్థి నాయకులు    విద్యార్థుల తల్లి తండ్రులకు   అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకోవడానికి  ప్రోత్సహించాలని జిల్లా సమన్వయ అధికారి యు గంగన్న  తెలియజేశారు.     ఆన్  లైన్ లో ఈ నెల పదహారు నుండి మార్చ్ పది వరకు  దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  ఏప్రిల్ ఎనిమిది న పరీక్ష  నిర్వహిస్తారన్నారు.

మహాసభ గోడప్రతుల విడుదల

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;   అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల యూనియన్  2వ  రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మహాసభ గోడప్రతులను సి ఐ టి యు మండల అధ్యక్షులు చంద్రకళ విడుదలచేసి మాట్లాడారు. .    ఈ నెల 18,19 వ తేదీలలో జరిగే  మహాసభలకు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పద్మ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్నవివిధ  సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. ఈ మహాసభకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు..   ఈ కార్యక్రమంలో టి ప్రమీల, జి భారతి, రాజేశ్వరి, సుబ్బలక్ష్మి, తిరుపతమ్మ, షైక్ సర్వార్బి, ఎస్ భారతి, గౌరు, పాల్గొన్నారు.

సంచార జాతుల కులాల నైపుణ్య వివరాల సేకరణ

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;   సంచార  జాతుల కులాల వారి  నైపుణ్య అభివృద్ధి కోసం పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన వారి వివరాలు సేకరించాలని కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవం పాటిల్  అధికారులను ఆదేశించారు.  తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జికూటివ్ ఆదేశానుసారం   జిల్లాలో   సంచారజాతుల అభ్యర్థుల వివరాలు సేకరించి ఈ నెల  లోపు ఆసిఫాబాద్ లోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు ఇందుకు సంబంధించిన నమూనా పత్రంలో పొందుపరిచిన అంశాల ప్రకారం వివరాలను పూర్తిచేసి అందించాలన్నారు.

డివిజినల్ లెవల్ టాలెంట్ టెస్టు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;   డివిజినల్ లెవల్ టాలెంట్ టెస్టును స్థానిక జడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఫోరెన్సిక్  ఫిజికల్ సైన్స్ టీచర్స్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం  నిర్వహించారు. ప్రశ్నపత్రంను జిల్లా అధికారి ఎండి రఫిక్ గారి చేతుల మీదుగా విడుదల చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎం ఉదయబాబు,  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ ప్రమీల, ఎఫ్పీఎస్టీ జిల్లా  జయ రాజేశం భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు శైలజ సరితా కె శ్రీదేవి జస్టిస్ రమేష్ మరియు వివిధ పాఠశాలల నుండి వచ్చిన డెబ్బై ఐదు మంది  పాల్గొన్నారు.

విద్యార్థులకు మానవీయ శాస్త్రాల అవగాహన సదస్సు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;   విద్యార్థులు మానవీయ శాస్త్రాల పై  అవగాహన  పెంచుకోవాలని ఐటీ సీఎస్ఏ తెలంగాణ సివిల్ సర్వీస్ అకాడమిక్ ఆంగ్ల అధ్యాపకులు భీంరావు అదిల్ పిలుపునిచ్చారు.    శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్  జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళా కళాశాల మరియు తెలంగాణ మాడల్ కళాశాలని.రెబ్బెన ఆర్డ్    & సైన్స్ కళాశాల  విద్యార్థులకు ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ   ప్రస్తుత పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఇష్టంతో శ్రమిస్తే విజయం తమ సొంతమవుతుందని అన్నారు తాము ఎంచుకునే లక్ష్యాన్ని ఇష్టంతో పట్టుదలతో  శ్రమించాలని అన్నారు విద్యార్థులు యువకులు  వ్యసనాలకు  దూరంగా ఉంటూ విద్యపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఉన్నత లక్ష్యానికి చేరుకోవాలి అని అన్నారు పరీక్షల సమయంలో విద్యార్థులు సెల్ ఫోన్లను  అధికంగా వాడడం వలన విద్యార్థులకు సరైన నిద్రలేకపోవడంతో జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతుందని  మానసిక ఆరోగ్యం పైన   ప్రభావం చూపుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు జాగిరి శ్రీకాంత్,  దుర్గం రవీందర్ పూదరి సాయి కిరణ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Thursday, 15 February 2018

విద్యార్థులు,యువకులు చెడు వ్యాసానాలకు దూరంగా ఉండాలి


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి  15 ;  విద్యార్థులు,యువకులు చెడు వ్యాసానాలకు దూరంగా ఉండాలని రెబ్బెన సి.ఐ పురుషోత్తమ చారి, ఎస్.ఐ శివకుమార్ లు అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ముద్రించిన "సెల్ ఫోన్ వద్దు-చదువే ముద్దు" కరపత్రలను స్థానిక సి.ఐ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా సెల్ ఫోన్ వాడడం వలన పరీక్షల పైన ప్రభావం చూపుతుందని అన్నారు. అంతే కాకుండా మానసిక ఒత్తిడికి,ఆందోళన నిరాశ,నిద్ర పట్టక పోవటం,కంటిచూపు మసక బారడం, చదువులో వెనుక బడటం, మెడ,భుజాల నొప్పులు,చేసే పని మీద ఏకాగ్రత లేకపోవడం లాంటివి జరుగుతాయని అన్నారు. విద్యార్థులు, యువకులు సెల్ ఫోన్ ద్వారా అసభ్యకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టె పోస్టులను పెడితే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ముద్రించిన కరపత్రలు విద్యార్థులకు చాలా ఉపయోగం పడతాయని ఇలాంటి కరపత్రలను ముద్రించి విద్యార్థులకు అందిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, ఎఐటియుసి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, నాయకులు జాడి గణేష్,కమల్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత విద్యకై విద్యార్థి ఎంపిక

ఉచిత విద్యకై విద్యార్థి ఎంపిక 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి  15 ;   ఆసీఫాబాద్ క్రమం జిల్లాలోని దళిత అభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ విద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో విద్యాభ్యాసం చడం కొరకు మన జిల్లా నుండి అడ్మిషన్లకై  లక్కీ డ్రా ద్వారా ఒక్కరిని ఎంపిక చేయడం జరిగిందని జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ అన్నారు గురువారం రోజున జిల్లా సంయుక్త  పాలనాధికారి కార్యాలయములో  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ లో ఒకటవ తరగతి అడ్మిషన్లకై లక్కీ డ్రా తీయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా ఒక్కొక్కరిని ఎంపిక చేయడం జరిగిందని అందులో భాగంగా మన జిల్లా నుండి ముగ్గురిని ఎంపిక చేయగా అందులో లక్కీ డ్రా ద్వారా మిట్టపల్లి సిద్ధార్థ్ ఎంపికయ్యారు ఈ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఉచిత చదువు  ఉంటుందని ఎంపికైన విద్యార్థి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు లక్కీడ్రాలో దళిత విద్య అభివృద్ధి శాఖ అధికారి సునీత ,బీసి వెల్ఫర్ అధికారి సాయిబాబా ,బిసి కార్పొరేషన్ అధికారి హనుమాన్లు, జిల్లా   స్కూల్ కో ఆర్డినేటర్ గంగన్న జిల్లా అధికారులు విద్యార్థులు తల్లి  తండ్రులు   పాల్గొన్నారు

తహశీల్దార్ కార్యాలయంలోసిబ్బంది లేక ప్రజల ఇక్కట్లు :కాంగ్రెస్ నాయకులు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి  15 ;  కొమురంభీం జిల్లా రెబ్బెన  మండల  తహశీల్దార్ కార్యాలయంలో  అధికారులు సిబ్బంది లేక ప్రజలు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని  కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్  అన్నారు. గురువారం రెబ్బెన అతిధి భవన  ఆవరణలో మాట్లాడుతూ  భూ ప్రక్షాళన పేరుతో స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నారు దీనివల్ల విద్యార్థులకు ఫీజు నెంబర్ మెంట్ సర్టిఫికెట్ విషయంలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు  గురి అవుతున్నారు అంతేకాకుండా ఓటరు నమోదుపై వచ్చేవారి కోసం సిబ్బంది లేకపోవడంతో దాని ప్రక్రియ కొనసాగడం లేదు పని నిమిత్తం అధికారులు వెళ్లి దాదాపు రెండు నెలలు అయినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు పన్నెండు గ్రామ పంచాయతీకి చెందిన రైతులు ప్రజలు వారి పని కోసం వచ్చి సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు నూతనంగా ఓటర్ నమోదు చేసుకునే విద్యార్థులు ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో అర్ధం కాక తిరిగి వెళ్లిపోతున్నారు.సత్వరమే రెబ్బెన మండల కేంద్రంలో నుండి సేవలు అందించని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో  యూత్ కాంగ్రెస్ నాయకులు  ఆది బాలాజీ, నాగేష్ ,సాయిరామ్ , సిడి లింగయ్య, మల్లేష్ ,సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 14 February 2018

జ్ఞాపక శక్తిపై విద్యార్థులకు అవగాహన సదస్సు

కొమురం భీం ఆసిఫాబాద్ (మా  ప్రతినిధి) ఫిబ్రవరి  14 ;  రెబ్బెన మండలకేంద్రములోని సాయి విద్యాలయము ఇంగ్లీష్ మీడియం  హైస్కూల్ (ఎస్వి స్కూల్)లో బుధవారం విద్యార్థుల జ్ఞాపకశక్తి పెంపొందించుటకు మరియు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. . ఈ సందర్భంగా గురువు ప్రసాద రాజు (,అసిస్టెంట్ ఇంజనీర్ కోల్  క్వాలిటీ కంట్రోల్ - కడప)  మాట్లాడుతూ విద్యార్థులు తమ చెవులను వ్యతిరేక  చేతి బొటనవ్రేలుతో పట్టుకొని 7 లేదా 14 లేదా 21 గుంజిళ్ళు తీయాలని అన్నారు. ఇలా చేయడంవలన  చెవుల దగ్గర ఉండే  నరాలు మెదడుకు అనుసంధానమై ఉండటం మూలాన జ్ఞాపకశక్తి పెరుగు తుందన్నారు.ప్రతి రోజు ఉదయం పూట క్రమము తప్పకుండ చేస్తే ఫలితం ఉంటుందని అన్నారు . ప్రసాద రాజు  విద్యార్థులకు చేయించి చూపించారు .   ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి , ప్రధానోపాధ్యాయులు దీకొండ సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు ,విద్యార్థులు   పాల్గొన్నారు.  

అంగన్వాడీ టీచర్ల 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్ల విడుదల

కొమురం భీం ఆసిఫాబాద్ (మా  ప్రతినిధి) ఫిబ్రవరి  14 ;   అంగన్వాడీ టీచర్ల 2వ  రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే2వ  రాష్ట్ర మహాసభల సందర్భంగా బుధవారం మహాసభ గోడప్రతులను సి ఐ టి యు  జిల్లా అధ్యక్షులు లోకేష్, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం దినకర్ లు విడుదలచేశారు. రాజంపేట అంబెడ్కర్ నగర్ లో   జరిగిన కార్యక్రమంలో  మాట్లాడారు.  ఈ నెల 18,19 వ తేదీలలో జరిగే  మహాసభలకు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పద్మ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు అనిత, పుష్పలత, సువర్ణ, సునీత, సరోజ, లీల, శారద, కమల, సులోచన,రజని, మంజుల,రమ,శోభ  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

 కొమురం భీం ఆసిఫాబాద్ (మా  ప్రతినిధి) ఫిబ్రవరి  14 ;  జిల్లా పరిధిలోని పాఠశాలల లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు  టాలెంట్ టెస్ట్ ను  భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు  ఎస్ ఎఫ్ ఐ సహాయ కార్యదర్శి రమేష్   బుధవారం ఒక ప్రకటనలో తేలిపారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 18 న ఉదయం 11 గంటలకు రెబ్బెన లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరుగుతుందని, కావున మండలంలోని అన్ని పాఠశాల ల లో  10 వ తరగతి చదువుతున్న  విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.