
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3; దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచిన తీర్పులను పెడ చెవిన పెట్టి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తిరుపతి అన్నారు. శనివారం కొమురం భీం జిల్లా గోలేటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9 న అన్నిజిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమంచేపట్టనున్నట్లు తెలిపారు. కావున ఈ నెల 9 న జరిగే ధర్నాకు కార్మికులు,కర్షకులు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి, ప్రధాన కార్యదర్సులు ఓదెలు, నాయకులు దేవాజి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment