కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 11 ; కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ రెవిన్యూ డివిషనల్ పరిధిలో వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆసిఫాబాద్ రెవిన్యూ డివిషనల్ ఆఫీసర్ కదం సురేష్ సందర్శించారు. ఫిబ్రవరి 11 ఆదివారం ప్రేత్యేక ఓటరు నమోదు దినోత్సవాన్నిపురస్కరించుకొని గోలేటి, ఇందిరానగర్, ఖైర్గం, కొండపల్లి, ఎడవెల్లి మొదలైన గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రేత్యేక పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు నమోదు తీరును పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు కొత్తగా ఆ ర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ సాయన్న, ఉప తహసీల్దార్ విష్ణు, రెవిన్యూ సిబ్బంది ఉమ్లాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment