కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 10 ; కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం వంకులం గ్రామంలో బస్సు స్టాండ్ నుండి రామాలయం వరకు 50 లక్షలతో కాంక్రీట్ రహదారి పనులకు ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి ,ఎం ఎల్ సీ పురాణం సతీష్ శనివారం భూమి పూజ చేసారు. అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీష్ మరియు ఎం ఎల్ ఏ కోవా లక్ష్మిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయమైన గ్రామ అభివృద్ధి లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోవడం లో విఫలమయ్యాయి, తెరాస ప్రభుత్వం ఒక్కటే గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అన్నారు. అలాగే తెరాస ప్రబుత్వం కల్యాణ లక్ష్మి లో భాగంగా ప్రతి ఇంటిలో పెళ్లి కాబోయే ఆడపడుచు కు 75000 నుండి 100000 పెంచడం జరుగుతుంది అన్నారు. అలాగే గత ప్రభుత్వాల వైఫల్యాల వాళ్ళ గ్రామ ప్రజలు తాగు నీటి, రోడ్ల విషయం లో ఎన్నో అవస్థలు పడ్డారు. నేడు తెరాస ప్రభుత్వం తాగునీటి కోసం మీషిన్ భగీరథ పనులు చేపట్టి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చనుంది,ముందు ముందు కూడా మరెన్నో అభివృద్ధి పనులను చేపట్టి వచ్చే ఎన్నికల్లో మల్లి తెరాస ప్రభుత్వం అధికారంలోకి రానుంది అన్నారు. రాష్ట్రంలోని ఆరె ,బారే కులస్తుల సంక్షేమానికి జిల్లా కేంద్రంలో సంక్షేమ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వంకులం గ్రామపంచాయతీ సర్పంచ్ జాదవ్ కమున భాయ్, ఎంపీడీఓ సత్యనారయణ సింగ్, ఎంపీటీసీ వర్షాభాయి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ భోర్కుటే నాగయ్య, రాళ్ల పేట్ వి టి డి ఏ అధ్యక్షులు-అజ్మేర మురళి దర్, తెరాస నాయకులు సోమశేఖర్,బొమ్మినేని శ్రీధర్ కుమార్, సుదర్శన్ గౌడ్,నవీన్ జైస్వాల్, శంకర్ నాయక్, నానాజీ వివిధ గ్రామపంచాయతీల సర్పంచ్ లు వార్డు మెంబర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment