కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 26 ; ఎన్నికలముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయూలు గౌడ్ అన్నారు. సోమవారం తిర్యాణిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. తెరాస ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల అమలుకై వచ్చే నెల ఐదు ఆరు తేదీల్లో తహశీల్ధార్ కార్యాలయం ముందు, పన్నెండవ తేదీన జిల్లా కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ,గిరిజనులకు మూడెకరాల భూమి, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇంటికో ఉద్యోగం చొప్పున లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగేండ్లయినా వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి ఆదిలాబాద్ పార్లమెంటు కన్వీనర్ అజుమేర రాము నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు మడావి సీతరాం, ప్రదాన కార్యదర్శి పులి వేంకటేష్, నాయకులు అమిరిశేట్టి రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment