కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 20 ; విద్యార్థులకు పరీక్షల సమయాలలో ప్రేత్యేక బస్సులు నడిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కుంబిడి రాజేష్ ఆసిఫాబాద్ రోడ్ రవాణాసంస్థ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు మొదలవుతున్నందున స్పెషల్ బస్సులు నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి జునుగరి రమేష్, షారుఖ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment