కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; యూపీఏ హయాంలోనే బ్యాంకుల స్కాంలు జరిగాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు జేపీ పౌడెల్ అన్నారు. ఆదివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్ డి ఏ ప్రభుత్వం ఎంతటి వారినైనా ఉపేక్షించదని అన్నారు.గత యూపీఏ ప్రభుత్వ హయములోనే బొగ్గు కుంభకోణం , టూ జి స్పెక్ట్రమ్ ,వంటి స్కామ్లు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రములో తెరాస ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ నీటి మూటలైనాయని,అన్నారు.దళితులకు మూడు ఎకరాలభూమి హామీని మర్చిపోయారన్నారు. లక్ష ఉద్యోగాల మాట మర్చిపోయి నిరుద్యోగు లను మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో జిల్లాప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, మురళి ధర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, సిర్పూర్ టి జడ్పీటీసీ అజమీర రామ్ నాయక్, జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాంద్రే విశాల్, బి సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment