కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; ఈ-పాస్ విధానంలో బయెమెట్రిక్ విధానం కీలకం. ఈ పాస్ యంత్రంలో వేలిముద్రల ద్వారా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం రేషన్ కార్డుదారులతోపాటు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అలాగే ఆధార్, ఫోన్ నెంబరు, కులం, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఈ-పాస్ విధానం అమలు కోసం పౌరసరఫరాల శాఖ ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సర్వర్ ఆధారంగా చేసుకొని మొబైల్ నెట్‌వర్క్ సహాయంతో రేషన్ దుకాణాల్లోని ఈ-పాస్ యంత్రాలు పనిచేస్తాయి. ఈ మేరకు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 3జీ మొబైల్ నెట్‌వర్క్ సిమ్ కార్డులను రేషన్ డీలర్లకు అందజేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ సర్వర్‌కు అనుసంధానంగా ఉండే 3జీ సిమ్ ద్వారా బయోమెట్రిక్ (ఈ-పాస్) యంత్రం పనిచేస్తుంది. ఇక ఈ-పాస్ యంత్రాన్ని ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలకు అనుసంధానం చేశారు. దీంతో బయోమెట్రిక్ ఈ-పాస్ యంత్రంలో వినియోగదారుల వేలిముద్రలు తీసుకొని రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే కచ్చితమైన కొలతలతో నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్ కార్డుదారుడు, లేదా ఆ కుటుంబంలోని లబ్ధిదారుల వేలిముద్రలు ఉంటేనే సరుకుల పంపిణి జరుగుతుంది. గతంలో వలే ఇతరులకు ఇకపై సరుకులను పంపిణీ చేయడానికి కుదరదు. మరోవైపు సరుకుల తూకం సరిగా వేస్తేనే ఈ-పాస్ యంత్రం నమోదు చేసుకుంటుంది. తద్వారా నిత్యావసరాలు సక్రమంగా, సరైన తూకంతో అందుతాయి. ఈ-పాస్ యంత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా నిత్యావసర సరుకులను పొందేందుకు వినియోగదారులకు సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రక్రియలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా రేషన్ సరుకులను కొనే వీలుంటుంది. కొత్తగా ప్రెవేశ పెట్టిన ఈ పాస్ విధానం వల్ల సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతుందని అన్నారు. కొన్ని ప్రేదేశాలలో అంతర్జాల ఇబ్బందితో , వేలిముద్రలు సరిగా రాక సరుకుల పంపిణి త్వరగా అవటం లేదన్నారు. ఒకటవ తారీఖు నుండి ఇరవై రెండు తేదీలలో పూర్తి పంపిణి జరగాలని ఆదేశాలున్న,ఇప్పటి వరకు కేవలం అరవై రెండు శాతమే పంపిణి చేయగలినట్లు కొంతమంది డీలర్లు తెలిపారు.
No comments:
Post a Comment