కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 21 ; ఇంటర్మీడియటే మొదటి సంవత్సరం మరియూ ద్వితీయసంవత్సర పరీక్షలు ఈ నెల 28వ తేది నుండి ప్రారంభమవుతునందున ప్రయివేట్ విద్య సంస్థలు ఈ సమయం లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండ సకాలములో హాల్ టికెట్లను అందజేయాలని ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి కుమార్ అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ కొన్ని ప్రయివేటు యాజమాన్య సంస్థలు ఫీజులు ఎక్కువగా దండుకునేందుకు ఇదే అదునుగా భావించి దౌర్జన్యంగా విద్యార్థుల పై ఫీజుల పేరుతో ఒత్తిడి తెస్తూ వారిని పరీక్షల సమయంలో మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనిఅన్నారు , ఇలా ఇబ్బందులకు గురిచేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికిగురై చదువుపై ద్రుష్టి పెట్టలేకపోతారన్నారు. విద్యార్థుల భవిషత్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులను మానసికంగా ఒత్తిడి కి గురిచేసే యాజమాన్యాల పై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశం లో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులూ డి రవి, మండలనాయకులు బొమ్మినేని శ్రీకాంత్, నరేందర్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment