కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5; కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల. రైతుల బడ్జెట్ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబి పౌడెల్ అన్నారు. కొమురంభీం జిల్లా బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల. రైతుల బడ్జెట్ అని అన్నారు.ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆరోగ్యపధకం ద్వారా సుమారు నలభై కోట్ల మందికి ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందుతాయని, ప్రతి రైతుకు పెట్టుబడికి ఒకటిన్నర రేట్లు రాబడి వచ్చేలా విధాన రూపకల్పన జరిగిందన్నారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్. సిర్పూర్ టి జడ్పీటిసి రాములు నాయక్. బిజెవైయం జిల్లా అధ్యక్షులు కాండ్రె విశాల్. సిర్పూర్ టి మండల అధ్యక్షులు వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment