Monday, 19 February 2018

ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 జన్మదిన ఉత్సవాలు




 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 19 ; ఛత్రపతిశివాజీ   మహారాజ్ 391  జన్మదిన ఉత్సవాలు కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లాలో    సోమవారం ఘనంగా జరుపుకొన్నారు.జిల్లాకేంద్రమైన  ఆసిఫాబాద్ లో రాష్ట్ర ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు   అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎం ఎల్  సి  పురాణం సతీష్ , ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి , ఎం ఎల్ ఏ  కోనేరు కోనప్ప ల  సమక్షంలో   ఛత్రపతి   శివాజీ  విగ్రహాన్నిఆసిఫాబాద్ పార్లమెంట్ సభ్యులు  గెడం నగేష్  ఆవిష్కరించారు. ఆరె కులస్తులు భారీగా చేరుకుని శివాజీ విగ్రహానికి ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర శివాజీ చరిత్రను  ఈ తరమువారు చదివి స్ఫూర్తి పొందాలని అన్నారు. జిల్లా కేంద్రంలో   ఛత్రపతి శివాజీ నూతన భవన నిర్మాణానికి  ఎం పి   10 ,ఎం ఎల్ సి 20, ఎం ఎల్ ఏ  20  లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆరె  కులస్తులను ప్రభుత్వం  అన్ని విధాలా ఆదుకుంటుందని  అన్నారు.   అలాగే రెబ్బెన  రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి , గంగాపూర్ గేట్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించడానికి  ప్రయత్నాలు ముమ్మరం  చేస్తున్నామన్నారు. అంతకు ముందు శివాజీ జన్మదిన సందర్భంగా ఆరె  కులస్తులు  మరియు శివాజీ  అభిమానులు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులగుండా భారీ ఎత్తున ర్యాలీ   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ చైర్మన్ లోక భూమి రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్ నల్లలా ఓదెలు, ఎం ఎల్ సీ  కరీంనగర్ నారదాసు లక్ష్మణ్ రావు,  ఆసిఫాబాద్ జిల్లా పరిషత్   అధ్యక్షురాలు శోభా రాణి,  జిల్లా  శివాజీ సమాజ్  అధ్యక్షులు బుర్కుటే నాగయ్య,   తదితరులు పాల్గొన్నారు.     

No comments:

Post a Comment