ఉచిత విద్యకై విద్యార్థి ఎంపిక
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; ఆసీఫాబాద్ క్రమం జిల్లాలోని దళిత అభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ విద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో విద్యాభ్యాసం చడం కొరకు మన జిల్లా నుండి అడ్మిషన్లకై లక్కీ డ్రా ద్వారా ఒక్కరిని ఎంపిక చేయడం జరిగిందని జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ అన్నారు గురువారం రోజున జిల్లా సంయుక్త పాలనాధికారి కార్యాలయములో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ లో ఒకటవ తరగతి అడ్మిషన్లకై లక్కీ డ్రా తీయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా ఒక్కొక్కరిని ఎంపిక చేయడం జరిగిందని అందులో భాగంగా మన జిల్లా నుండి ముగ్గురిని ఎంపిక చేయగా అందులో లక్కీ డ్రా ద్వారా మిట్టపల్లి సిద్ధార్థ్ ఎంపికయ్యారు ఈ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఉచిత చదువు ఉంటుందని ఎంపికైన విద్యార్థి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు లక్కీడ్రాలో దళిత విద్య అభివృద్ధి శాఖ అధికారి సునీత ,బీసి వెల్ఫర్ అధికారి సాయిబాబా ,బిసి కార్పొరేషన్ అధికారి హనుమాన్లు, జిల్లా స్కూల్ కో ఆర్డినేటర్ గంగన్న జిల్లా అధికారులు విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు
No comments:
Post a Comment