కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 7 ; సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని కోరుతూ బుధవారం నాడు బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని వివిధ గనులు మరియు డిపార్ట్ మెంట్, డోర్లి, కైరగూర,బీపీఏ ఓసిపి 2 లలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు అయ్యారు. కార్మికుల ప్రధాన సమస్య అయిన వారసత్వ ఉద్యోగాలను వెంటనె కల్పించాలని అన్నారు. దసరా కు ఓటు వేస్తే దీపావళి కి వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్సి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఆ దిశగా ఏమి చేయలేదని అన్నారు. సింగరేణి కార్మికులకు .వడ్డీ లేని పది లక్షల రుణాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షులు బయ్య మోగిలి, ఆర్గనైజింగ్ సెక్రేటరీ బి.జగ్గయ్య, ఏఐటీయూసీ కార్మికులు నర్సింహ్మ రావు, చుంచు రాజన్న, దివాకర్, చంద్రయ్య, కిరణ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment