Monday, 12 February 2018

రేషన్ డీలర్లతో సమావేశమైన తహసీల్దార్

   రేషన్ డీలర్లతో సమావేశమైన తహసీల్దార్     
                                     
 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ; లబ్దిదారులకు మరియు  రేషన్ డీలర్లకు పంపిణీలో  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఉండేందుకు ఈ పాస్ విధానంను ప్రారంభించినట్లు రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్న అన్నారు.  అవలంబించి సకాలంలో సరుకులు అందించాలని తహశీల్దార్ సాయన్నకోరారు. . కొమురంభీం జిల్లా  రెబ్బెన మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు రేషన్ డీలర్లతో  సమావేశం  నిర్వహించారు. ఈ  సందర్బంగా తహశీల్దార్ సాయన్న మాట్లాడుతూ లబ్ది దారులకు    సకాలంలో ఈ పాస్ విధానంలో  సరుకులు అందించాలని రేషన్ డీలర్లకు సూచించారు. రేషన్ డీలర్లు   ఈ పాస్ విధానం లోఉన్నసమస్యలను    వివరించగా,    డీలర్ల  సమస్యలను  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికై ప్రయత్నం చేస్తానన్నారు..  ఈ సమావేశం లో ఉప తహశీల్దార్ విష్ణు ,రెవెన్యూ సిబ్బంది ఉమ్లాల్ ,రేషన్ డీలర్లు శ్రీపతి, మురళి ,సంతోష్ ,శెంకర్ ,తిరుపతి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment