Monday, 12 February 2018

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ


  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ;రెబ్బెన మండలం లక్ష్మిపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరిగింది. అరే సంక్షేమ సంఘం   జిల్లా అధ్యక్షుడు బోరుకుటే నాగయ్య విగ్రహావిష్కరణ గావించి మాట్లాడుతూ  ఈ నెల 19  ఆరె   కులస్తుల ఆరాధ్యదైవమైన వీర శివాజీ 398 జయంతిని పురస్కరించుకొని  ఘనంగా ఉత్సవాలు జరప నిశ్చయించినట్లు చెప్పారు.  . ఈ జయంతిని అరె  కులస్థులు మరియూ ప్రజలు ఘనంగా  జరుపుకోవాలని కోరారు. ఈ సందర్బంగా అరె కులస్థులు,గ్రామ అధ్యక్షులు సాయిరె తిరుపతి ,జైరాం ,నానాజీ ,తిరుపతి, మరియూ నాయకులూ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment