కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3; పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులందరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయించుకోవాలని రెబ్బెన తహసీల్దార్ సాయన్న అన్నారు. కొమురం భీం జిల్లా రెబ్బెన మండల కార్యాలయంలో శనివారం ఓటర్ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులందరిని ఓటర్లుగా నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి పధ్నాలుగు వరకు కొనసాగుతుందని కావున అందరు తప్పని సరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
No comments:
Post a Comment