కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 20 ; దళితులకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలని సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్ కు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాండ్రే విశాల్ మంగళవారం వినతిపత్రం అందచేసారు. అనంతరం మాట్లాడుతూ ఆసిఫాబాద్ గొల్లగూడ గ్రామపంచాయతి పరిధిలోని ఎస్ సి కాలనీలో పది కుటుంబాలు కూలి నాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని వారికీ ప్రభుత్వం ప్రకటించిన దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కింద సాగు భూమిని అందచేయాలన్నారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు వినతి పాటలు అందచేయడం జరిగిందన్నారు. తెరాస అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు నాలుగు సంవత్సరాల పరిపాలన అనంతరం హామీలుగానే మిగిలాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాధిక,జి. మల్లన్న, రాకేష్, ఎస్ సి కాలనీ వాసులు రాజన్న, నగేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment