కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; విద్యార్థులు,యువకులు చెడు వ్యాసానాలకు దూరంగా ఉండాలని రెబ్బెన సి.ఐ పురుషోత్తమ చారి, ఎస్.ఐ శివకుమార్ లు అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ముద్రించిన "సెల్ ఫోన్ వద్దు-చదువే ముద్దు" కరపత్రలను స్థానిక సి.ఐ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా సెల్ ఫోన్ వాడడం వలన పరీక్షల పైన ప్రభావం చూపుతుందని అన్నారు. అంతే కాకుండా మానసిక ఒత్తిడికి,ఆందోళన నిరాశ,నిద్ర పట్టక పోవటం,కంటిచూపు మసక బారడం, చదువులో వెనుక బడటం, మెడ,భుజాల నొప్పులు,చేసే పని మీద ఏకాగ్రత లేకపోవడం లాంటివి జరుగుతాయని అన్నారు. విద్యార్థులు, యువకులు సెల్ ఫోన్ ద్వారా అసభ్యకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టె పోస్టులను పెడితే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ముద్రించిన కరపత్రలు విద్యార్థులకు చాలా ఉపయోగం పడతాయని ఇలాంటి కరపత్రలను ముద్రించి విద్యార్థులకు అందిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, ఎఐటియుసి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, నాయకులు జాడి గణేష్,కమల్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment