కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల యూనియన్ 2వ రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మహాసభ గోడప్రతులను సి ఐ టి యు మండల అధ్యక్షులు చంద్రకళ విడుదలచేసి మాట్లాడారు. . ఈ నెల 18,19 వ తేదీలలో జరిగే మహాసభలకు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పద్మ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్నవివిధ సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. ఈ మహాసభకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.. ఈ కార్యక్రమంలో టి ప్రమీల, జి భారతి, రాజేశ్వరి, సుబ్బలక్ష్మి, తిరుపతమ్మ, షైక్ సర్వార్బి, ఎస్ భారతి, గౌరు, పాల్గొన్నారు.
No comments:
Post a Comment