
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ; గోలేటిలోని గౌతమ్ నగర్ లో మంచినీటి మరియూ సి సి రోడ్ సౌకర్యం కల్పించాలని, సి పి ఐ నాయకులు ,కాలనీ వాసులు గ్రామ పంచాయతీ సెక్రెటరీకి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా సీపీఐ నాయకుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ కాలనీ లో ఒక సంవస్సర కాలం నుండి మంచినీటి సౌకర్యం లేక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.అధికారులు పైప్ లైన్ వేసి నల్ల కనేక్షన్ ఇవ్వకపోవడం తో త్రాగునీరు అందడం లేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు గౌతంనగర్ కాలనీ కి త్రాగు నీరు మరియూ సి సి రోడ్ సౌకర్యం కలిపించాలని కోరారు అలాగే కాలనీ వాసులు మాట్లాడుతూ. ప్రతి రోజు త్రాగు నీటి కోసంకిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తుందని త్రాగు నీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నాం అని మా బాధల్ని ఇప్పటికైనా అధికారులు గుర్తించి మా గౌతమ్ నగర్ కాలనీ కి నీటి సౌకర్యం కలిపించాలని వారు కోరారు
No comments:
Post a Comment