
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; బెల్లంపల్లి ఏరియా కు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడం కోసం అన్ని చర్యలను చేపట్టడం జరిగిందని , ఫిబ్రవరి నెలలో 93 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని బెల్లంపల్లి ఏరియా జియం రవి శెంకర్ అన్నారు. గోలేటి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. వార్షిక ఉత్పత్తి పరంగా చూస్తే 102 శాతం అధిగమించడం జరిగిందని . బెల్లంపల్లి ఎరియా కు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడం కోసం సింగరేణి అధికార మరియ కార్మిక బృందం కృషి చేయాలనీ సూచించారు .అలాగే బెల్లంపల్లి ఏరియా 650 కోట్ల లాభాలతో ముందంజలో ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి తో పటు రవాణా లో కూడా రికార్డు స్థాయిలో ఉందన్నారు సింగరేణి 11 ఏరియా లతో కలిపి ఈ సంవస్సరానికి 11 వందల కోట్ల రూపాయల ఆదాయం అర్జించడం జరుగుతుందని సింగరేణి సిఎండి పేర్కొన్నట్లు తెలిపారు బెల్లంపల్లి ఏరియా లోని డోర్లి 1 జీవిత కాలాన్ని పొడిగించడం కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు 92 కోట్ల వ్యయంతో చేపట్టిన సిఎస్పి నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగినదని గోలేటి నుండి గోలేటి ఎక్స రోడ్ వరకు రోడ్ వెడల్పు కొరకు టెండర్లను కూడా పూర్తయినట్లు తెలిపారు. ఈ వేసవి కాలం లో దరఖాస్తు చేసుకునే ప్రతీ కార్మికుడికి ఏ సి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం శ్రీనివాస్ , డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్ ,డి వై పి యం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment