కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల పర్యటన ఆదివాసులను నిరాశపరిచిందని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ లు అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి పర్యటనతోనైనా పరిష్కారమవుతాయని ఆదివాసీలు ఆశించారు కానీ ఆదివాసీల సమస్యలపై ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో స్పందించలేదన్నారు. అన్నారు.ముఖ్యంగా ఆదివాసీల పోడు భూములకు పట్టాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న పట్టా పెట్టుబడి గురించి ప్రకటిస్తార ని ప్రజలు ఆశించారు. నకిలీ ఏజెన్సీ సర్టిఫికేషన్, నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలపై ఏజెన్సీలలో వలసల విషయంలో కెసిఆర్ ప్రకటించవసిందన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగులో ఉన్న ప్రతి ఎకరాకు అందించాల్సిన కౌలు మరియు పోడు పంట పెట్టుబడి సహాయం అందించాలని, ఆదివాసీ గ్రామాలకు షెడ్యూల్ ఏజెన్సీలో కలపాలని ఏజెన్సీ పనుల విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలనిఅన్నారు పై సమస్యలన్నీ పరిష్కరించి ఆదివాసులను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కొమురంభీం జిల్లాలోనే ఐటిడిఏను ఏర్పాటు చేసి ఐఎఎస్ అధికారిని నియమించాలన్నారు ఈ సమావేశంలో టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి సైతం రాజు ఉపాధ్యక్షులు రైతులు ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ జిల్లా సహాధ్యక్షులు కొడప రాజేష్ వేలాది జ్యోతిరావు ఎర్రయ్య లచ్చయ్య చందు పోషక ఫ్రీడమ్ గంగారాం బంగారంతో తరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment