కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 22 ; కొమురంభీం జిల్లా రెబెనా మండలం నారాయణపూర్ గ్రామస్థుడు వేమునూరి పురుషోత్తం 24 సంవత్సరాలు గత ఆరు నెలలనుండి అదే గ్రామానికి చెందిన యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడినందున బాధిత యువతి తండ్రి ఆయిల్లా రమేష్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అరెస్ట్ చేసినట్లు గురువారం రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తంచారి విలేకరుల సమావేశంలో తెలిపారు. తల్లి, తండ్రి, సోదరుడు పనికి వెళ్లగా సరిగా మాట్లాడలేని బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా నిందితుడు బాధితురాలి పై ఆత్యహరానికి గత ఆరునెలలుగా పాల్పడ్డాడని ప్రస్తుతం బాధితురాలు నాలుగు నెలల గర్భిణీ అని తెలిపారు. నిందితుడిని రెబ్బెన పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకై ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి పంపినట్లు తెలిపారు. నేరస్తుడిని జుడిషియల్ రేమండ్ కు తరలించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment