కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 6 ; సింగరేణి సంస్థ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ కోరుతూ సింగరేణి కార్మికులు తలపెట్టిన ఒక రోజు సమ్మెను విజయవంతం చేయాలనీ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు.రెబ్బెన మండలం గోలేటిలోమంగళ వరం ఏర్పాటు చేసిన విలేఖరులసమావేశంలో మాట్లాడారు. గుర్తింపు ఎన్నికలు జరిగి సుమారు ఐదు నెలలు గడుస్తున్నా ఎలాంటి చలనం లేదన్నారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దసరాకు ఓటేస్తే దీపావళికి దెపెందెంత్ ఉద్యోగాలిస్తామని కార్మికులను మభ్యపెట్టి మరొక్కసారి మోసం చేశారన్నారు. యూనియన్ తలపెట్టిన సమ్మెను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్మిక శక్తిని చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి ,కార్యార్సులు సత్యనారాయణ, లష్మినారాయణ, దివాకర్, నరసింహ రావు నాయకులూ లక్సమం, పోచారం, పోచమల్లు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment