Monday, 5 February 2018

బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి ; జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్

బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి ; జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5;  పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిబ్బంది పనిచేయాలని   జిల్లా సూపెరింటెండ్ అఫ్ పోలీస్  కల్మేశ్వర్ సింగెనవార్  అన్నారు. . సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయముగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదుల  లో  ఉషారాణి భర్త  చoద్రశేఖర్  లోనవెల్లి  గ్రామము నుంచి తన    భర్త ఇంకొక వివాహం చేసుకొని తనకు ఎటువంటి ఆస్థి ఇవ్వటం లేదని తమకు మనోవర్తి ఇప్పించి తగు విధంగా న్యాయం చేయాలనీ ఫిర్యాదు చేశారు, ఛిట్ల వెంకటరమణ తండ్రి  ఉషయ్య  ,గ్రామం  రెబ్బెన,  మందావగడ్  పాత్రు తండ్రి తుకారాం  కౌటాల మండలం , హాఫిజ్ బేగం భర్త  షేక్ మహాబూద్ మండలం  కాగజ్ నగర్ టౌన్ మరియు గంధం దేవాజి తండ్రి సోమయ్య గ్రామం  పోతపల్లి  పెంచికలపేట్ మండలము లు తమ తమ భూ తగదాలను జిల్లా ఎస్పికువివరించారు. ఇంకా జిల్లా లోని ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ తమ ఫిర్యాధులను జిల్లాఎస్పి కు విన్నవించారు సమస్యల పైన స్పందించిన జిల్లాఎస్పి ఫిర్యాదుదారులకు తక్షణం  న్యాయం జరిగేలాచర్యలు తీసుకుంటానని ఫిర్యాదుదారులకు హామీ ను ఇచ్చారు, తగు సూచనలతో సంబందిత అధికారులనుఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా ఎస్పి ఆదేశించారు. ఈ కార్యక్రమం లో  అడ్మినిస్ట్రేషన్ అధికారి భక్త ప్రహలద్,ఎస్బి సీ ఐ సుధాకర్, సిసి కిరణ్ కుమార్, డిసీఆర్బీ ఎసైరాణాప్రతాప్ ,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , అజయ్ వర్మ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత మరియు పీఆర్ ఓ మనోహర్ లు  పాల్గొన్నారు.



No comments:

Post a Comment