కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; కేంద్రం లో భాజపా ప్రభుత్వం స్వదేశీ జాతీయ దేశభక్తి పేరుతో దేశం లోని బొగ్గు గనులను బహుళ జాతి సంస్థలకు అప్పగించేందుకు కుట్రపన్నుతున్న దని. భారత కార్మిక సంఘాల సమాఖ్య తరుపున అడ్డుకుంటామని జి ఎల్ బి కే ఎస్ నాయకుడు మైసూర్ సింగ్ అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్స్ రెబ్బెన మండలం గోలేటి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మైసూర్ సింగ్ మాట్లాడుతూ కోలిండియాలో 214 బ్లాకులను ప్రయివేటీకరించుటకు బీజేపీ ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా బొగ్గు బ్లాకులు కార్పొరేటు సంస్థల చేతికి పోవడం జరుగుతుందని, ఈ విధంగ జాతియ సంపద ప్రయివేటు సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంపదలను విదేశీ సంస్థలకు అమ్మి ఒక లక్ష కోట్లను బడ్జెట్ సమావేశాలకు సమకూర్చుకోవాలని నిర్ణయించింది అని తెలిపారు ఇప్పటికే సింగరేణి గనులను తెరాస ప్రభుత్వం ప్రయివేటీకరించినది ఈ ప్రయివేటు విధానాలకు వ్యితిరేకంగా కార్మికవర్గం పెద్దఎత్తున పోరాడాలని తెలిపారు ఈ సమావేశం లో జిల్లా నాయకులూ ,తిరుపతి ,సురేంధేర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment