పదోన్నతులు పొందిన పోలీస్ ఉద్యోగులకు ఘన సన్మానం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; కొమురంభీం జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నడి రాజయ్య, సుభాష్ చంద్ర మండల్ పదోన్నతి పొందిన సందర్భంగా రెబెనా సర్కిల్ ఇనస్పెక్టర్ పురుషోత్తం చారి , ఎస్సై శివకుమార్ లు అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ రాజయ్యకు అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ పదోన్నతి లభించింది. కానిస్టేబుల్ సుభాష్ చంద్ర మండల్ కు హెడ్ కానిస్టేబుల్ గ పదోన్నతిపై సిర్పూర్ (టి) పోలీస్టేషన్ కు బదిలీ అయ్యింది. శుక్రవారం .సాయంత్రం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో జరిగిన సిబ్బంది అభినందన కార్యక్రమంలో సర్కిల్ ఇనస్పెక్టర్ పురుషోత్తం చారి, ఎస్సై శివకుమార్ లు మాట్లాడుతూ క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదోన్నతులు లభించడం సంతోషదాయకమన్నారు. పదోన్నతి పొందిన సిబ్బందికి శాలువా కప్పి సన్మానించారు. . ఇకముందు కూడా వీరు మరింత బాధ్యతతో పనిచేసి గుర్తింపు తెచుకోవా లన్నారు. స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతులు పొందినవారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా జైనూర్ లో పనిచేసిన నర్సయ్య బదిలీపై రెబ్బెన పోలీస్ స్టేషన్ అడిషనల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
No comments:
Post a Comment