కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో తెరాస పార్టీ నాయకులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో లో కేక్ కట్ చేసి , రోగులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎంపిపి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి శాంతియుతంగా తెలంగాణ రాష్టాన్ని సాధించి, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్న ధీశాలి కెసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోపార్టీ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, నాయకులూ జకీర్ ఉస్మాని, వనజ, నవీన్ కుమార్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, చిరంజీవిగౌడ్, వినోద్, చంద్రయ్య, అశోక్,సురేష్ జైశ్వాల్, ఉబెదుల్లా తదితరులు పాల్గొన్నారు. అలాగే గోలేటిలోని టి బి జి కే యస్ తెలంగాణ భవన్ లో జరిగిన కెసిఆర్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణి చేసారు. ఈ సందర్బంగా టి బి జి కే యస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదాశివ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశ జ్యోతి సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎం . శ్రీనివాసరావు సెంట్రల్ కార్యదర్శి,es . ప్రకాశరావు నాయకులు డి మంగిలాల్, ఏరియా కార్యదర్శి పోటు శ్రీదర్రెడ్డి, మోర్ల నరేందర్, రాజుఎం .కుమారస్వామి, రాంబాబు, మస్కు రమేష్, జిల్లా కోర్దినేటర్ కొండు సత్తయ్య, అన్నం లస్మయ్య, బి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment