Tuesday, 13 February 2018

మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు




కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 13 ;    మహా శివరాత్రి సందర్భంగా కొమురంభీం జిల్లా లోని ఈజ్గం  ఆసిఫాబాద్, కెరిమెరి, జైనూర్, కగజనగర్, రెబ్బెన, గోలేటి,  మండలాలలోని లోని    శైవ క్షేత్రాలు శివ నామ  స్మరణతో  మంగళవారం   మరు మ్రోగాయి . రెబ్బెన  మండలము లోని నంబాల గ్రామము  లో గల ప్రసన్న పరమేశ్వర ఆలయము  జాతర రంగ రంగ వైభవంగా సాగింది . ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై, , మోటారు సైకిళ్లపై తరలి  వచ్చారు భక్తులు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు. ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు . కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .ఈ కళ్యాణములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు . ఈ పూజలలో  దంపతులు  స్వామి వారి  కళ్యాణం లో పాల్గొన్నారు.  . స్వామివారికి ప్రత్యక పూజలు నిర్వహించారు.


ఈ జాతర లో వచ్చిన భక్తులకు  కొంతమంది  దాతలు  అన్నప్రసాద  వితరణ  గావించారు.  . భక్తుల కు ఎలాంటి అసౌ కర్యాలు  కలగకుండా ఆలయ కమిటి అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాణా  కొరకు  ప్రత్యక బస్సులు నడిపారు .ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ  పోలీసుశాఖవారు      భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు . .
కన్నుల పండుగగా  రధోత్సవం 

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 13 ;  జిల్లావ్యాప్తంగా పరమేశ్వరాయలలో    మంగళవారం  సాయంత్రము  శివ పర్వతుల రధోత్సవం  ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ కార్యక్రమంలో  లో భక్తులు తండోప  తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రధోత్సవం లో పాల్గొన్నారు.   . శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది . అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు . సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు. రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను  మంత్ర ముగ్దులను చేసింది . అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ స్మరణతో జాగరం చేస్తూ  గడిపారు.

No comments:

Post a Comment