కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 9 ; ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. రెబ్బన మండలం గోలేటి గ్రామ పంచాయతీలోని గోపాల్ వాడ లో సింగరేణి సేఫ్ నిధుల నుండి ఐదులక్షల రూపాయలతో చేపట్టిన సీసీరోడ్లను ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మరియు బెల్లం పెల్లి ఏరియా జిఎం రవిశంకర్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నది ,అలాగే సింగరేణి కూడా వారి నిధులతో సింగరేణి పరిసర ప్రాంతాల్లో అభివృద్ధిని చేపట్టడం అభినందనీయం ,అలాగే ముందు ముందు కూడా సింగరేణి వారు వారి యొక్క నిధులతో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతున్నామన్నారు. ,జీఎం రవిశంకర్. మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాలతో పటు పరిసర గ్రామాల అభివృద్ధిని చేయడం జరుగుతుంది సీయస్సార్ నిధులు ,డిస్టిక్ మినరల్ ఫండ్ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది డిస్టిక్ మినరల్ ఫండ్ లో సింగరేణి 71 కోట్లు జమ చేయడం జరిగినది ఈ యొక్క నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కారక్రమయంలో జి ఎం సంజీవ్ కుమార్ ఎంపీపీ ,జడ్పీటీసీ బాపూరావు ,సర్పంచ్ తోట లక్ష్మణ్, ,ఎంపీటీసీ వనజ ,ఉపసర్పంచ్ రవి నాయక్ ,శ్రీధర్,ఆత్మరావు నాయక్ ,శేఖర్ ,శ్రీనివాస్ రావు ,సోమశేఖర్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment