కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; పిపిఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆసిఫానాద్ లో ఎమ్మెల్యే కోవలక్ష్మి కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిఎస్ రద్దు విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా టిఎస్యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆగాచారి డిటిపి జిల్లా అధ్యక్షులు మడావి రమేష్ టీఎస్ సీఎస్ టిటియు జిల్లా అధ్యక్షులు మేడి చందాదాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం వలన సుమారు ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డిటిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఎం రాజా కమలాకర్రెడ్డి టిఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి పూర్ణ సిపిఎస్ టిఇయు జిల్లా కో ఆర్డినేటర్ సూర్యనార్ కార్ చైతన్య కుమార్ నాయకులు ఆత్రం పితాంబర్ మాల్ షిండే తంగడపల్లి రమేష్ దుర్గం శ్రీనివాస్ నవీన్ తదితరులున్నారు.
No comments:
Post a Comment