కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; కొమురంభీం జిల్లా రెబ్బెన మండల తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది లేక ప్రజలు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్ అన్నారు. గురువారం రెబ్బెన అతిధి భవన ఆవరణలో మాట్లాడుతూ భూ ప్రక్షాళన పేరుతో స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నారు దీనివల్ల విద్యార్థులకు ఫీజు నెంబర్ మెంట్ సర్టిఫికెట్ విషయంలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అంతేకాకుండా ఓటరు నమోదుపై వచ్చేవారి కోసం సిబ్బంది లేకపోవడంతో దాని ప్రక్రియ కొనసాగడం లేదు పని నిమిత్తం అధికారులు వెళ్లి దాదాపు రెండు నెలలు అయినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు పన్నెండు గ్రామ పంచాయతీకి చెందిన రైతులు ప్రజలు వారి పని కోసం వచ్చి సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు నూతనంగా ఓటర్ నమోదు చేసుకునే విద్యార్థులు ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో అర్ధం కాక తిరిగి వెళ్లిపోతున్నారు.సత్వరమే రెబ్బెన మండల కేంద్రంలో నుండి సేవలు అందించని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆది బాలాజీ, నాగేష్ ,సాయిరామ్ , సిడి లింగయ్య, మల్లేష్ ,సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment